Ram Charan Daughter: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన రీసెంట్ గానే ఒక పాప కి జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భాన్ని మెగా కుటంబం తో పాటు మెగా అభిమానులు కూడా ఒక సంబరం లాగ జరుపుకుంటున్నారు. సుమారుగా పదేళ్ల నుండి నిరీక్షిస్తున్న అభిమానులకు ఈ వార్త తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా పాప భవిష్యత్తు బాగుండాలని పూజలు చేయించారు.
పాప పుట్టినరోజే మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని మీడియా ముందు పంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈరోజు కాసేపటి క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఈ సమావేశం లో ఆయన తన బిడ్డని అందరికీ చూపిస్తాడని అనుకున్నారు కానీ,చూపించలేదు. కేవలం చేతిలో పట్టుకున్నట్టు మాత్రమే మీడియా కి చూపించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కాబట్టి , ఉపాసన కి డెలివరీ విషయం లో మేము ఎలాంటి భయం పెట్టుకోలేదు. మా పాప కోసం రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేసిన మా అభిమానుల గురించి ఏమి చెప్పాలో కూడా తెలియడం లేదు, వారికి ఈ సందరంభంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.
పాపకి ఏమి పేరు పెట్టబోతున్నారు అని ఒక విలేఖరి అడగగా దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘నాకు సంప్రదాయాలు పెద్దగా తెలియవు, పాప పుట్టిన 12 వ రోజు కానీ, 13 వ రోజు కానీ పేరు పెడతారట. అప్పటి వరకు వెయిట్ చెయ్యండి, నేను ఉపాసన ఒక పేరు అనుకున్నాం, మీ అందరికీ ఆరోజే తెలియచేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పాప ఎవరి పోలికలతో పుట్టింది సార్ అని అడగగా ‘కచ్చితంగా వాళ్ళ నాన్న పోలికలతోనే పుట్టింది’ అంటూ సమాధానం ఇచ్చాడు రామ్ చరణ్.