Ram Charan And Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో ప్రభాస్ ఒకరు.ఈయన చేసిన సినిమాలు దాదాపు ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈయన చేసిన సినిమాల్లో కొన్ని ప్లాప్ లు ఉన్నప్పటికీ ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకులు ఆ సినిమాని కనీసం ఒక్కసారైనా చూడాలి అనుకునేవారు…ముఖ్యంగా ప్రభాస్ సినిమా అంటే ఫైట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఆయన చేసే ఫైట్స్ గాని అని చెప్పే డైలాగులు గాని ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ని పొందాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ లాంటి ఒక నటుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆయన తో పాటు ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనతో సినిమాలు చేస్తే వాళ్ళకి కూడా ఎక్కువగా లాభాలు వస్తాయి కాబట్టి వాళ్లు కూడా ప్రభాస్ సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు…ఇక ఇది ఇక ఉంటే మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా తనదైన రీతిలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో పూరి జగన్నాథ్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నాడు కానీ అది పట్టాలెక్కలేదు… అప్పట్లో మల్టీ స్టారర్ సినిమాలు అంటే అందరు ప్రొడ్యూసర్లు భయపడేవారు ఎందుకంటే హీరోల మధ్య ఉండే ఆ స్టార్ డం ని మేనేజ్ చేయడంలో డైరెక్టర్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా ఆ హీరోల ఫ్యాన్స్ నుంచి ప్రొడ్యూసర్లకి చాలా ఇబ్బంది ఎదురవుతాయనే ఉద్దేశ్యం తోనే వాళ్ళు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు కాదు.ఇక ఇండివిజువల్ గా సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు.
ఇలా రామ్ చరణ్,ప్రభాస్ కాంబో లో రావలసిన ఒక మల్టీ స్టారర్ సినిమా అనేది మిస్ అయింది… ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్,ప్రభాస్ హీరోలుగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…ఇక ఇప్పుడు మరి కొంత మంది డైరెక్టర్లు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…ఇక ఏది ఏమైనా రాజమౌళి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడంతో ఇప్పుడు అందరికీ ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది…