Sandeep Reddy Vanga: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ఈ కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో లేనట్టే అని తెలుస్తోంది. ఎందుకంటే సందీప్ వంగ, అల్లు అర్జున్ మధ్య బాగా గ్యాప్ పెరిగినట్టు సమాచారం. వాస్తవానికి ‘స్పిరిట్’ కంటే ముందే సందీప్ వంగ సినిమా షూటింగ్ మొదలు అవ్వాలి. కానీ వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా అది కార్య రూపం దాల్చలేదని అంటున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ ఫోకస్ మొత్తం ప్రభాస్ స్పిరిట్ మూవీ మీదనే ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇందులో ప్రభాస్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు సందీప్ వంగ.
గత ఏడాది నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. త్వరలోనే మెక్సికో దేశంలో నెల రోజుల భారీ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ తో 50 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యినట్టే అని అంటున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సందీప్ వంగ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ కాంబినేషన్ కి సంబంధించి చర్చలు కూడా పూర్తి అయ్యాయి అట. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా ఒక ప్రాజెక్ట్ లాక్ అయ్యినట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న మహేష్ బాబు, ఈ సినిమా పూర్తి అవ్వగానే సందీప్ వంగ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేస్తాడని టాక్.
ఇలా సందీప్ వంగ లైనప్ వరుసగా నాలుగేళ్ల వరకు లాక్ అయిపోయింది . మరోపక్క అల్లు అర్జున్ కూడా అట్లీ, లోకేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత ఆయన ఏకంగా రాజమౌళి తో సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాబట్టి అల్లు అర్జున్, సందీప్ వంగ కాంబినేషన్ లో సినిమాని ఇప్పట్లో మనం చూడలేము అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. భవిష్యత్తులో అయినా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఉంటుందో లేదో చూడాలి. ఒకవేళ క్రేజీ కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ కాదు,ఇంటెర్నేషల్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వుధి అని చెప్పొచ్చు.
