Ram Charan: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిత్రాన్ని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమంతో ప్రారంభమైనది రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈ పాట చిత్రీకరణ పూణేలో జరుగుతోందిట రామ్ చరణ్ ఒక పాటకు చిత్రీకరణకు 3 నుంచి 5 రోజులు తీసుకుంటారు. కాని శంకర్ సినిమాల్లో పాటలు… వేరే రేంజ్‌లో చిత్రీకరిస్తారు అని తెలిసిందే. ఈ సినిమా పాటల కోసం 12 రోజులను కేటాయించారు అని సమాచారం.

ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోందిట ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మిస్తున్నారు. ఎస్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందించనున్నారు. అలానే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో
రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వీరుడైన అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ చేయగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, సముద్ర ఖని, శ్రియ, తదితర నటులు నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. 2022 జనవరి 7న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు .
రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమాకు తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు అట. జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇంకొక కొత్త సినిమా తెరకెక్కనుంది.ఈ రెండు చిత్రాలకు అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.