Ram Charan: ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ ,శంకర్ దర్శకత్వంలో” RC15 ” వంటి పాన్ ఇండియా చిత్రాలలో బిజీగా ఉన్నారు చెర్రీ.ప్రస్తుతం చరణ్ ” RC15 ” షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారట అయితే ఈ చిత్రం నుండి తాజాగా మరో అప్డేట్ వచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ” విశ్వంభర” ఈ సినిమా లో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకి స్ థమన్ స్వరాలను సమకూరుస్తున్నారు.ఇటీవలే మహారాష్ట్రలోని పూణే లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది చిత్ర బృందం.
ఈ సినిమా సెకండ్ షూటింగ్ న హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు నుండి ప్రారంభం కానుంది చెర్రీ, కియారాపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.చరణ్ కి ఈ చిత్రం 15వ సినిమా అవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. మలయాళ నటుడు జయరామ్,సురేశ్ గోపీ సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, రామ్చరణ్ ఆచార్య సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానుంది. చిరంజీవి సరసన కాజల్, చెర్రీ కి జోడీగా పూజ హెగ్డే నటించింది.