Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య తాత మనవడు గా నటిస్తున్న చిత్రం “బంగార్రాజు”. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ చిత్రం ఇటీవలే తూర్పుగోదావరి లో షూటింగ్ పూర్తి చేసుకొని మైసూర్ లో సందడి చేయనుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ నాగార్జున తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’ నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు ఇటీవల ఈ చిత్రం నుండి లడ్డు ఉండా అంటూ ఒక సాంగ్ కూడా విడుదలైంది.
అయితే తాజాగా ఈ సినిమా మైసూర్ లో వారం రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ జరగనుంది నాగచైతన్య, కృతీశెట్టి కాంబినేషన్‌లో వచ్చే లవ్ బ్యాక్‌డ్రాప్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. మైసూర్ షెడ్యూల్ పూర్తికాగానే తర్వాతి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేస్తారట ‘బంగార్రాజు’ యూనిట్ బృందం.
2016లో సూపర్ హిట్ అయినా “సోగ్గాడే చిన్నినాయానా” చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ ఇప్పటికే కొంత మేరకు షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది.రావు రమేష్, వెన్నెల కిషోర్, చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.