Ram Charan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ది బెస్ట్ క్లైమాక్స్ సన్నివేశాల లిస్ట్ తీస్తే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది పోకిరి, ఆ తర్వాత రంగస్థలం. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్ మాత్రం మరో ఎత్తు. కమర్షియల్ గా ఈ చిత్రాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది మాత్రం క్లైమాక్స్. ‘కానీ మీరు మా అన్నయ్యని చంపడం మాత్రం కరెక్ట్ కాదయ్యా’ అంటూ రామ్ చరణ్ ప్రకాష్ రాజ్ తో కొట్టిన డైలాగ్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఇది కదా సినిమా అంటే అంటూ ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు. అయితే ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ సినిమా, శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఒక భూత్ బంగ్లా సెట్ లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. అయితే బుచ్చి బాబు ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని వేరే లెవెల్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ క్లైమాక్స్ రంగస్థలం చిత్రాన్ని తలదన్నే విధంగా ఉంటుందట. కేవలం ఈ క్లైమాక్స్ సన్నివేశం కోసం సినిమాని పదే పదే థియేటర్స్ కి వచ్చి చూస్తారట. అలాంటి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ సన్నివేశాన్నే తెరకెక్కిస్తున్నారట. షూటింగ్ కార్యక్రమాలు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి, ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషితున్నాడు.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగుతుందట. రామ్ చరణ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో ఆయన అంధుడిగా నటిస్తాడని ఇండస్ట్రీ లో ఒక రూమర్ ఉంది. ఛాలెంజింగ్ రోల్స్ అంటే రెచ్చిపోయి మరీ జీవించే రామ్ చరణ్కే, ఈ క్యారక్టర్ ని ఏ రేంజ్ లో చేస్తాడో చూడాలి. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పెట్టేందుకు పరిశీలిస్తున్నారు. ఉగాది లోపు టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ నుండి రాబోతున్న సినిమా ఇది. మెగా అభిమానులు ఒక రేంజ్ కసితో ఉన్నారు. కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలి అని కోరుకుంటున్నారు. మరి ఈ చిత్రం రామ్ చరణ్ కి బిగ్గెస్ట్ కం బ్యాక్ ఇచ్చే సినిమా అవుతుందా లేదా అనేది చూడాలి.