Ram Charan And Allu Arjun Fight: రామ్ చరణ్(Global Star Ram Charan),అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఒకే కుటుంబానికి చెందిన హీరోలు అయినప్పటికీ కూడా ఇద్దరు పాన్ ఇండియన్ హీరోలు అవ్వడంతో వీళ్లిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ ఏ రేంజ్ లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు రామ్ చరణ్ ని నెంబర్ 1 హీరో గా చూడాలని బహిరంగంగా కోరుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు తానే నెంబర్ 1 హీరో అనే రేంజ్ లో తనని తాను గత కొంతకాలంగా ప్రొజెక్ట్ చేసుకోవడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇక్కడే మెగా మరియు అల్లు ఫ్యామిలీ మధ్య చిచ్చు రేగిందని, ఆ చిచ్చు కాస్త కారుచిచ్చుగా మారి ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్త. అయితే లేటెస్ట్ గా వీళ్లిద్దరి మధ్య గొడవ జరగడానికి మరో కారణం ఉందంటూ బాలీవుడ్ మీడియా ఒక ప్రచారం చేసింది.
Also Read: రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లతో పోలిస్తే మహేష్ బాబు కి తెలివి ఎక్కువగా ఉందా..?
అల్లు అర్జున్ కి పెళ్లి కాక ముందు ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడని, అదే హీరోయిన్ రామ్ చరణ్ సినిమాలో నటించి, రామ్ చరణ్ కి బాగా క్లోజ్ అయ్యిందని. కానీ కొన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్ ఆ హీరోయిన్ తో బ్రేకప్ చేసుకోవడం, ఆ బ్రేకప్ కి కారణం రామ్ చరణ్ ఆ హీరోయిన్ కి చెప్పిన మాటల వల్లే అపార్థం చేసుకొని వెళ్ళిపోయింది అని వీళ్లిద్దరి మధ్య ఉన్న ఒక వ్యక్తి అల్లు అర్జున్ కి మాటలు చేరవేయడం దగ్గర నుండి వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిందని ఆ బాలీవుడ్ మీడియా ఛానల్ చెప్పుకొచ్చింది. అదే విధంగా కెరీర్ పరంగా కూడా ఇద్దరు హీరోలు పాన్ ఇండియా రేంజ్ కి ఎదగడం తో ఆ గ్యాప్ ఇంకా దూరంగా పెరుగుతూ వచ్చిందని అంటున్నారు.
అందుకే అల్లు అర్జున్ తాను చేసే ప్రతీ చర్య పరోక్షంగా రామ్ చరణ్ కి వ్యతిరేకంగా చేస్తున్నట్టు అయ్యింది. ఉదాహరణకు 2024 ఎన్నికల సమయం లో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కి వెళ్తాడు, అదే రోజున అల్లు అర్జున్ కూడా నంద్యాల లో ఉండే తన స్నేహితుడు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కోసం వెళ్ళాడు. ఒకేసమయం లో ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన వాళ్ళ కోసం వెళ్లడం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. రామ్ చరణ్ పిఠాపురం కి వెళ్తున్నాడు అనే విషయాన్నీ తెలుసుకునే అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లాడని అందరూ అంటుంటారు. అందులో ఎంత వరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ మళ్ళీ కలిసి ఒకప్పటి లాగా అన్యోయంగా కనిపించేంత వరకు వీళ్ళ గురించి ఇలాంటి రూమర్స్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.