Ram Charan and Allu Arjun : కజిన్స్ అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్(Icon Star Allu Arjun), రామ్ చరణ్(Global Star Ram Charan) మధ్య నడుస్తున్న వార్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి మధ్య ఒకప్పుడు ఉన్నంత సాన్నిహిత్యం ఇప్పుడు కూడా ఉందో లేదో తెలియదు కానీ, శత్రుత్వం అయితే లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి, నాగబాబు వంటి వారు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అల్లు కుటుంబం మొత్తానికి ధైర్యం చెప్పడం వంటివి అందుకు ఉదాహరణ. ఇద్దరి రేంజ్ బాగా పెరిగింది కాబట్టి, వాళ్ళ అభిమానుల కోసం ఒకప్పటి లాగా ఒకరిపై ఒకరు భజన చేసుకోలేరేమో అంతే. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో అల్లు అర్జున్, సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అల్లు అర్జున్ ప్రస్తుతం కమిట్ అవుతున్న ప్రాజెక్ట్స్ కారణంగా ఈ సినిమా అట్టకెక్కిందని, ఇప్పుడు ఇది రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్లిందని అంటున్నారు. ఇటీవల కాలం లో సందీప్ వంగ ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లడం వంటివి చూస్తుంటే సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ ప్రచారం లో నిజముందని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో ఆయన్ని ట్యాగ్ చేసి, అప్పట్లో రామ్ చరణ్ కి మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మీ బ్యానర్ నుండి వచ్చింది. ఇప్పుడు బావ కోసం మరో క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేసి ఇచ్చావు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. కచ్చితంగా రామ్ చరణ్, సందీప్ వంగ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని తెలుసు కానీ, ఎప్పుడు వస్తుంది అనే దానిపై క్లారిటీ లేదు.
ప్రస్తుతం సందీప్ వంగ ఫోకస్ మొత్తం ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం మీదనే ఉందట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ ఉన్నాడు సందీప్. అయితే ఈ చిత్రం ఈ ఏడాది మొదలయ్యే అవకాశం లేకపోవడంతో ఈలోపు రామ్ చరణ్ సినిమాని మొదలు పెడతాడని, వచ్చే ఏడాది లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తాడని ఒక టాక్ వచ్చింది. కానీ ఈ వార్తలను సందీప్ టీం తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సందీప్ వంగ ద్రుష్టి మొత్తం స్పిరిట్ చిత్రం మీదనే ఉంది, వేరే సినిమా గురించి ఆయన ఆలోచించడం లేదని చెప్పుకొచ్చారు. మరోపక్క రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన సుకుమార్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ రెండు పూర్తి అయ్యాకనే సందీప్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read : గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరు టాప్ హీరోనో తేలబోతుందా..?