Homeఎంటర్టైన్మెంట్తనకు ఇల్లును గిఫ్ట్ గా ఇవ్వడం పై రకుల్ వివరణ !

తనకు ఇల్లును గిఫ్ట్ గా ఇవ్వడం పై రకుల్ వివరణ !

Samantha Rakul Preet
సమంత అక్కినేని…ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్మయితో డబ్బింగ్ చెప్పించుకునేది. కానీ ఇప్పుడు తెలుగు నేర్చుకుని ఇప్పుడు ఏకంగా తెలుగు షోలకు యాంకరింగ్ చేసేస్తుంది. బిగ్ బాస్ షోలో ఒక ఎపిసోడ్ చేసి తనలో నటన ఒకటే కాదు, యాంకరింగ్ ప్రతిభ కూడా ఉందని నిరూపించింది. దక్షిణాదిలో ఈమెకున్న ఫేమ్ అండ్ ప్రతిభని ఉపయోగించుకుంటూ అల్లు అరవింద్ తన ఓటీటీ సంస్థ ‘ఆహా’లో `సామ్ జామ్` అనే షోకి రూపకల్పన చేశారు. తొలి ఎపిసోడ్‌‌లో విజయ్ దేవరకొండను అతిథిగా తీసుకొచ్చారు. తొలి ఎపిసోడ్‌కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే, సెకండ్ ఎపిసోడ్‌లో రానా దగ్గుబాటి పాల్గొనడం.. ఆయన తన జీవితంలో ఎదురైన పాజ్ బటన్ గురించి అంటే అనారోగ్యం గురించి వెల్లడించడంతో.. ఆ ఎపిసోడ్‌ బాగా హైలైట్ అయ్యింది. ఇక ఎపిసోడ్ 3లో బ్యాడ్మింటన్ దంపతులు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. ఆ తరవాత ఎపిసోడ్ 4లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. రోజు రోజుకి షోకి పాపులారిటీ పెరిగిపోతూ ఉంది.

Also Read: బిగ్ బాస్ ముగింపుకు అదిరిపోయే ప్లాన్ !

ఇక తమన్నా తర్వాత ఎపిసోడ్ 5 కోసం మరో ఇద్దరు సెలబ్రిటీలను తీసుకొచ్చారు . స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు క్రిష్ సామ్ జామ్ షోలో పాల్గొన్నారు. రకుల్ అండ్ సమంతా ముందు నుండి మంచి స్నేహితులు. ఇక సమంత షో లో రకుల్ అండ్ క్రిష్ లని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి సమాధానం కోరింది. తన మీద వచ్చిన పుకార్లకు రకుల్ సమాధానమిస్తుందా అని సమంతా అడగగా రకుల్ ఓపెన్ అయ్యి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పుకార్లు పుట్టించి ప్రచారం చేసేవారు అసలు ఎలాంటి ఆలోచన అవాగాహన లేకుండా చేసేస్తున్నారు. నేను కష్టపడి సంపాదించి కొనుకున్న ఇంటిని నాకు ఎవరో ఒకతను గిఫ్ట్ గా ఇచ్చారని కూడా ప్రచారం చేశారు. అలా గిఫ్ట్ లు ఇచ్చేవారు ఉన్నట్లయితే నేను ఎందుకు ఈ విధంగా కష్టపడతాను. ఇలాంటి వివాదాలన్నిటికి నేను సమాధానం ఇవ్వాలనుకోవటంలేదు, నా పని వారికి సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నానని రకుల్ చాలా ఉన్నతంగా చెప్పుకొచ్చారు.

Also Read: ఎన్ని బాధలు.. ఎన్ని విఫల ప్రేమ కథలు.. అందుకే !

ఇక దర్శకుడు క్రిష్ కూడా తన మీద వచ్చిన వివాదాలకి ఎప్పుడూ స్పందించకూడదని అనుకుంటానని కానీ మణికర్ణిక మూవీ మీద వచ్చిన వివాదానికి మాత్రం రియాక్ట్ అవ్వాల్సొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆయన చెప్పిన సమాధానాన్ని ప్రోమోలో చూపించలేదు అనుకోండి, డిసెంబరు 18న ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ లో అసలు సంగతులు చూడాల్సిందే. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో ఎపిసోడ్ ని క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రేక్షకులకి అందించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular