https://oktelugu.com/

ఆ ముగ్గురూ వద్దనుకుంటే రకుల్ ఒప్పుకుంది !

హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ అందరికి షాక్ ఇవ్వడానికి కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా నటించబోతుందనే విషయం తెలిసిందే. కండోమ్ కంపెనీలో ఒక లేడీ ఎక్స్ క్యూటివ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ? అందరూ ఆమెను ‘సెక్స్’క్యూటివ్ గా ట్రీట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. సినిమాలో రకుల్ పాత్ర పని ఏమిటంటే.. కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్, అంటే కండోమ్స్ నాణ్యతని పరిశీలించి చెప్పే పనిని చేయబోతుంది […]

Written By: , Updated On : May 5, 2021 / 09:23 AM IST
Follow us on

Rakul Preet Singhహీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ అందరికి షాక్ ఇవ్వడానికి కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా నటించబోతుందనే విషయం తెలిసిందే. కండోమ్ కంపెనీలో ఒక లేడీ ఎక్స్ క్యూటివ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ? అందరూ ఆమెను ‘సెక్స్’క్యూటివ్ గా ట్రీట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. సినిమాలో రకుల్ పాత్ర పని ఏమిటంటే..

కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్, అంటే కండోమ్స్ నాణ్యతని పరిశీలించి చెప్పే పనిని చేయబోతుంది రకుల్. బాలీవుడ్ లో రానున్న ఈ మూవీ పక్కా కామెడీ మూవీగా తెరకెక్కనుంది. ‘కండోమ్ టెస్టర్’ పాత్రని రకుల్ పోషించబోతుంది. ఐతే, ఈ పాత్రలో నటించే ఛాన్స్ రకుల్ కి లక్కీగా వచ్చింది. నిజానికి ఈ పాత్రను మొదట జాన్వీ కపూర్ తో లేదా అనన్య పాండేతో చేయించాలని అనుకున్నారు మేకర్స్.

కానీ వాళ్ళు ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఆ తరువాత సారా అలీ ఖాన్ ను అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా నో చెప్పింది. మొత్తమ్మీద ఈ పాత్ర చేసేందుకు ఆ ముగ్గురూ ముందుకు రాకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ను ఆ పాత్ర కోసం తీసుకున్నారు. రకుల్ కి ఇప్పుడు ఎలాగూ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.

అందుకే హిందీలో వస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకుపోతుంది. ఏది ఏమైనా బోల్డ్ క్యారెక్టర్స్ ను పోషించడంలో రకుల్ ఆరితేరిపోయింది. ఇంతకీ ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రాని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఇక వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.