
కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ పై సోషల్ మీడియాలో ఓ వీడియో గత రెండు మూడురోజులుగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. రకుల్ చేతిలో రెండు బాటిల్స్ పట్టుకొని రోడ్డు దాటుతూ కన్పిస్తుంది. ఈ బాటిల్స్ ఏంటనేవి స్పష్టం కన్పించకపోవడంతో కొందరు రకుల్ మద్యం బాటిళ్లు తీసుకెళుతుందంటూ ప్రచారం చేశారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు ఇది చర్చనీయాంశంగా మారడంతో దీనిపై రకుల్ స్పందించింది. తప్పుడు ప్రచారం చేసిన వారందరికీ దిమ్మతిరిగేలా రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
విశాఖ ఘటనను తేలిగ్గా తీసుకోవద్దు…!
ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ మెడికల్ షాపులో రకుల్ మందులు కొనుగోలు చేసింది. వాటిని తీసుకొని రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే కొందరు రకుల్ మద్యం కొనుగోలు చేసి తీసుకెళుతున్నట్లు తప్పుడు ప్రచారం చేయడంతో వైరల్ అయింది. దీంతో కొందరు రకుల్ ను ట్రోల్ చేస్తుండటంతో క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అదే వీడియోను తన ట్వీటర్లో పోస్టు చేస్తూ రకుల్ కౌంటర్ ఇచ్చింది. ‘వావ్.. మెడికల్ షాపుల్లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయా? ఆశ్చర్యంగా ఉంది.. ఆ విషయం తనకు తెలియదే’ అంటూ తప్పుడు ప్రచారం చేసేవారి మత్తు దిగేలా కౌంటర్ ఇచ్చింది. రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంపై ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.