Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: నడుము ఊపుతూ రకుల్ హాట్ డాన్స్ వీడియో... నన్ను చంపేయ్ అంటూ...

Rakul Preet Singh: నడుము ఊపుతూ రకుల్ హాట్ డాన్స్ వీడియో… నన్ను చంపేయ్ అంటూ మంచు లక్ష్మీ క్రేజీ కామెంట్

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డాన్స్ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. నడుము ఉయ్యాలలా ఊపుతూ నాగుపాములా రకుల్ ఆడింది. జీరో సైజు బాడీలో రకుల్ షేకింగ్ స్టెప్స్ సెగలు పుట్టిస్తుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూశాక ప్రముఖులు సైతం మనసులో ఫీలింగ్ ఆపుకోలేకున్నారు. మంచు లక్ష్మి రకుల్ డాన్స్ వీడియోపై స్పందించారు. నన్ను చంపేయ్ ఉఫ్.. అంటూ ఓ షాకింగ్ కామెంట్ పోస్ట్ చేశారు. రకుల్ వీడియోతో పాటు మంచు లక్ష్మీ కామెంట్ సైతం వైరల్ గా మారింది. టాలీవుడ్ లో రకుల్ కి చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. రానా, మంచు లక్ష్మితో ఆమె అత్యంత సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ ఆమెకు బెస్ట్ ఫ్రెండ్. తరచుగా వీరిద్దరూ విహారాలు చేస్తూ ఉంటారు.

Rakul Preet Singh
Rakul Preet Singh, manchu Lakshmi

ఇక టాలీవుడ్ లో రకుల్ కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరింది. అయితే ఆమె బాలీవుడ్ లో దూసుకుపోతుంది అజయ్ దేవ్ గణ్ కి జంటగా రకుల్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం హిట్ కొట్టింది. అప్పటి నుండి ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి. రకుల్ నటించిన రెండు చిత్రాలు అటాక్, రన్ వే 34, రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ఫలితం మాత్రం నిరాశపరిచింది. అటాక్ అట్టర్ ప్లాప్ కాగా, రన్ వే 34 పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

Also Read: VP Khalid Passess Away: మలయాళ పరిశ్రమలో విషాదం… సీనియర్ నటుడు హఠాన్మరణం

రకుల్ చేతిలో మరో నాలుగు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జి, థాంక్ గాడ్, ఛత్రి వాలి చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆమె తెలుగులో చేస్తున్న ఒకే ఒక చిత్రం 31 అక్టోబర్ లేడీస్ నైట్. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇక కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 లో రకుల్ హీరోయిన్ గా నటించారు. వివాదాల కారణంగా భారతీయుడు 2 విడుదలకు నోచుకోవడం లేదు. విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో భారతీయుడు 2 విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh
Rakul Preet Singh, manchu Lakshmi

మరోవైపు రకుల్ తన ప్రియుడిని పరిచయం చేసింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విరామం దొరికినప్పుడల్లా రకుల్ ప్రీత్ సింగ్ అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. పెళ్లి ఎప్పుడంటే మాత్రం మండిపడుతుంది.

Also Read:Pokiri Movie: పోకిరిని మిస్ చేసుకున్న ఆ స్టార్ ఎవరు?


Recommended Videos
పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరో తెలుసా || Actress Pavitra Lokesh First Husband ||  Suchendra Prasad
Sonu Sood Latest Gym Work Out Visuals || Sonu Sood Latest Video || Oktelugu Entertainment
గీతాంజలి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో  చూడండి || See How Geetanjali Movie Heroine is Now

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version