Rakul Preet Singh: స్టార్స్ కి క్షణం తీరిక ఉండదు. మీటింగ్స్ షూటింగ్స్ అంటూ బిజీ జీవితాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఎంత సంపాదించినా సేదతీరడం కూడా అవసరం. అందుకే ఏమాత్రం విరామం దొరికినా వెకేషన్ కి చెక్కేస్తారు. బరువు బాధ్యతలు, పనీ పాట పక్కన పెట్టి హ్యాపీ గా చిల్ అవుతారు. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న రకుల్ ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్స్ కలిగి ఉన్నారు. ఈ ఏడాది రకుల్ ఏకంగా ఐదు చిత్రాలు విడుదల చేశారు. అక్టోబర్ 25న థాంక్ గాడ్ చిత్రం విడుదలైంది.

సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్ గణ్ లీడ్ రోల్స్ చేసిన థాంక్ గాడ్ మూవీలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్లు పర్లేదన్నట్లున్నాయి. మొన్నటి వరకు థాంక్ గాడ్ చిత్ర ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ పాల్గొన్నారు. సినిమా విడుదల కావడంతో థాంక్ గాడ్ మూవీ బాధ్యతల నుండి బయటపడింది. దీంతో వెంటనే మాల్దీవ్స్ కి వెళ్ళిపోయింది.
ప్రశాంతతకు మాల్దీవ్స్ బీచెస్ పెట్టింది పేరు. అందులోనూ ఇండియాకు కూతవేటు దూరంలో ఉండే మాల్దీవ్స్ మన స్టార్ ఫేవరెట్ హాలిడే స్పాట్ గా ఉంది. ఇక మాల్దీవ్స్ బీచెస్ లో బికినీలో జలకాలాడుతూ రకుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తన వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇస్తున్నారు. రకుల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న బికినీ లుక్ చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. రకుల్ బికినీ ఫోజులు ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. రకుల్ అందాల విందు కుర్రాళ్ళ ఆకలి తీర్చేస్తుంది.

దాదాపు వారం రోజులు రకుల్ మాల్దీవ్స్ లో ఉండే సూచనలు కలవు. కాగా రకుల్ ప్రస్తుతం ఛత్రీవాలీ, మేరీ పత్నీకా రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఛత్రీవాలీ మూవీలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపించడం విశేషం. ఈ రెండు బాలీవుడ్ చిత్రాలతో పాటు భారతీయుడు 2 మూవీలో నటిస్తున్నారు. భారతీయుడు 2 షూటింగ్ జరుపుకుంటుంది. వివాదాల కారణంగా మధ్య ఆగిపోయిన భారతీయుడు 2 షూట్ కమల్-శంకర్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కాజల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక తెలుగులో రకుల్ దాదాపు ఫేడ్ అవుట్ అయినట్లే. వరుస ప్లాప్స్ తో టాలీవుడ్ కి దూరమయ్యారు.