Rakul Preet Singh Marriage: తమ్ముడు చేసిన పనికి రకుల్ ప్రీత్ ఆవేదన చెందుతుంది. నన్ను అడగకుండా నా పెళ్లి కన్ఫర్మ్ చేస్తావా? అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. విషయంలోకి వెళితే అక్టోబర్ 10న రకుల్ బర్త్ డే జరుపుకుంది. గత ఏడాది అదే రోజు ఆమె లవర్ ని పరిచయం చేశారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు కామెంట్ పెట్టి అతనితో దిగిన ఫోటో పోస్ట్ చేశారు. ఈ న్యూస్ ఒకింత షాక్ ఇచ్చింది. హీరోయిన్స్ అఫైర్స్ అధికారిక ప్రకటనకు ముందే మీడియాలో వచ్చేస్తాయి. నిజంగా ఎఫైర్ ఉన్నా లేకున్నా ఊహాగానాలు చక్కర్లు కొడతాయి. అలాంటిది రకుల్-జాకీ రిలేషన్ గురించి ఒక్క మీడియా సంస్థ కూడా రిపోర్ట్ చేయలేదు.

ఇక జాకీని ప్రియుడిగా పరిచయం చేసి ఏడాది దాటిపోతుండగా… పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలు ఎక్కువైపోయాయి. ప్రెస్ మీట్స్ లో రకుల్ ని ప్రముఖంగా పెళ్లి గురించి స్పందించాలని కోరుతున్నారు. పదే పదే అడుగుతుంటే రకుల్ కి విసుగొచ్చేస్తుంది. దానికి ఇంకా సమయం ఉంది. కుదిరినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. వివాహం కంటే జీవితంలో ముఖ్యమైన విషయాలు అనేకం ఉంటాయి. ప్రతిసారి అడిగి ఇబ్బంది పెట్టొద్దని రకుల్ తెలియజేశారు.
అయితే రకుల్ పెళ్లిపై ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రముఖ మీడియా సంస్థ అమన్ ప్రీత్ ని సంప్రదించడం జరిగింది. రకుల్-జాకీ వివాహం ఎప్పుడని అడగ్గా… వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా వేస్తున్నారు. అయితే స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. పెళ్లి కుదిరిన నాడు రకుల్ స్వయంగా ప్రకటిస్తుంది. ప్రస్తుతం రకుల్, జాకీ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్నారని వెల్లడించారు.

అమన్ ప్రీత్ మీడియా ముందు చేసిన ఈ కామెంట్స్ రకుల్ ని అసహనానికి గురి చేశాయి. జాకీతో పెళ్లి దాదాపు ఖాయమే, బిజీ షెడ్యూల్స్ వలన కుదరడం లేదని అమన్ చెప్పడం ఆమెకు నచ్చలేదు. సోషల్ మీడియా ద్వారా తన వేదన సెటైరికల్ గా తెలియజేసింది. ‘అమన్ నువ్వు కన్ఫర్మ్ చేసేశావా? నాకు కూడా చెప్పలేదేంటి బ్రో?. నా లైఫ్ గురించి నాకు కూడా తెలియకపోవడం చాలా ఫన్నీగా ఉందని, ట్వీట్ చేసింది. రకుల్ ట్వీట్ ఆమెకు జాకీని వివాహం చేసుకునే ఆలోచన ఉందా లేదా అనే అనుమానాలు రేపింది.