Rakasa movie collection : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ‘రాకాస'(Rakasa Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై ప్రీమియర్ షోస్ నుండే మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తుంటే , ఈ చిత్రానికి మొదటి రోజు బుక్ మై షో యాప్ లో దాదాపుగా 1 లక్ష టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం లో దాదాపుగా 40 శాతం కి పైగా మొదటి రోజే ఈ చిత్రం రీకవరీ చేసేలా ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయట.
అదేమిటంటే ఈ చిత్రం కోసం సంగీత్ శోభన్ రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నాడట. అది దాదాపుగా 50 లక్షల వరకు ఉంటుందని టాక్. అంతకు మించి నిర్మాత నిహారిక కొణిదెల నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదట. సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది, ఓటీటీ రైట్స్ , సాటిలైట్ రైట్స్, ఆడియో మరియు డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేంజ్ లోనే అమ్ముడుపోయింది కాబట్టి, సంగీత్ శోభన్ కి మరో కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని అదనంగా ఇవ్వొచ్చు. అంటే ఈ చిత్రానికి ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కేవలం కోటి 50 లక్షల రూపాయిలు మాత్రమే అన్నమాట. ఇది చాలా అంటే చాలా తక్కువ అనొచ్చు . ఎందుకంటే సంగీత్ గత రెండు చిత్రాలు మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్ కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం సంగీత్. అలాంటి హీరో ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం అన్యాయం అంటూ సోషల్ మీడియా లో ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సంగీత్ కి ఇది కెరీర్ ప్రారంభం స్టేజి కాబట్టి కంగారు పడాల్సిన అవసర లేదు. ఇప్పుడు వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి , తదుపరి చిత్రం నుండి సంగీత్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే రేంజ్ ముద్ర ఆడియన్స్ లో పడుతుంది. అది జరిగినప్పుడు ఇక ఆయన రెమ్యూనరేషన్ రెండింతలు పెరుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈయన చాలా పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
