Rajamouli Mahesh Babu movie confusion : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తన కంట ఒకూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చినా సినిమాలే కావడం విశేషం… ప్రభాస్ (Prabhas) చేసిన బాహుబలి (Bahubali) సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయన ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) లతో చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునేలా ఆయనకు హెల్ప్ చేస్తున్నాయి… ఇక ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో తనను తాను ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద దాదాపు 1200 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలో ట్రేడ్ పండితులైతే ఉన్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లను కొల్లగొట్టాలి అంటే దానికి తగ్గట్టుగా మార్కెట్ ను క్రియేట్ చేయాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఈ సినిమా మీద ఓవర్ హైప్ ని పెంచాలని తద్వారా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని సినిమా మేధావుల నుంచి కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అనే రేంజ్ లో ఆయన సినిమాలైతే చేసుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఆయనకు ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చింది.
అదేంటి అంటే 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్లు రాబడుతుందా? లేదా అనే విషయంలో ఆయన కొంతవరకు సందిగ్ధ పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికోసమే ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క వీడియోని కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.
మేకింగ్ వీడియో ని కూడా ప్రముఖ ఓటిటి సంస్థలకు ఒక గిట్టుబాటు ధరకి అమ్మేసి దాని ద్వారా వచ్చే ప్రాఫిట్స్ ని కూడా ప్రొడ్యూసర్స్ కి అందించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ బిజినెస్ యాంగిల్ లోనే ఆలోచిస్తున్న రాజమౌళి మరి తన కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటిని వెతుక్కుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…