
68 ఏళ్ళ వయసులో.. పైగా ప్రస్తుతం కరోనా కాలం, రోజురోజుకూ కరోనా విజృభిస్తోన్న రోజులు.. అయినా ఏ మాత్రం విరామం లేకుండా సినిమాలు చేయడానికి కుర్రహీరోలు కూడా భయపడుతుంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం చకచకా సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని తెగ ఆశపడుతున్నారు. తనను సూపర్ స్టార్ ను చేసిన ప్రజలు కోసం, ఎలాగూ రాజకీయాల్లోకి వచ్చే దైర్యం చేయలేకపోయిన రజినీకాంత్.. కనీసం సినిమా అయినా వేగంగా చేసి అభిమానులను సంతోష పెట్టాలని భావించారు. అందుకే, ఆరోగ్యం సహకరించకపోయినా అభిమానుల ఈలలు గోలలు తల్చుకుంటూ షూట్ కి సిద్ధం అయ్యారు.
అయితే, వైద్యుల సలహా మేరకు కరోనా తగ్గేవరకూ పూర్తిగా రజనీని ఇంటికే పరిమితం అయితే మంచింది అని అంటున్నారు. అదేం పట్టించుకోని తలైవా మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రజిని చేస్తోన్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ (అన్నయ్య) సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉండగానే అనగా గత ఏడాది చివర్లో హైదరాబాద్‌లో షూట్ జరిగినప్పుడు యూనిట్‌లో నలుగురికి కరోనా రావడంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
ఆ తరువాత రజినికి కూడా ఆరోగ్య సమస్యలు రావడంతో.. ఇక షూటింగ్ ఇప్పట్లో ఉండదు అనుకున్నారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాని ఈ ఏడాది నవంబరు 4న విడుదల చేయాలని రజిని నిర్ణయించుకున్నారట. అందుకే అప్పటిలోగా షూటింగ్ ను పూర్తీ చేయాలి కాబట్టి, ప్రస్తుతం దర్శకుడు శివతో షూటింగ్ ఫిక్స్ చేసుకోమని.. వచ్చే వారం నుండి తాను షూట్ లో పాల్గొంటాను అంటూ మొత్తానికి మెసేజ్ అయితే పాస్ చేశారు రజిని. కాకపోతే దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి.. రజిని మళ్ళీ షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేస్తారేమో చూడాలి.