Rajanikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ రీల్ లైఫ్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టాప్ ఇండియన్ హీరో. అయితే, రియల్ లైఫ్‌లో ఆయన ప్రజల్లో ఒకరిగా జీవిస్తుంటారు. ఎప్పుడు డౌన్ టు యర్త్ లైఫ్‌ను ఇష్టపడే ఆయనకు.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులు ఉండటానికి కారణం రజనీ స్టైల్ ఒకటైతే.. ఆయన సింప్లిసిటీ మరో కారణం.
❤🙏🏻 pic.twitter.com/RDcZ3ytJKO
— RajiniBalu🤘 (@RajiniBalu13) December 17, 2021
కాగా, ఆయన తరచూ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ.. లేని వారికి సాయం చేసి వారికి అండగా నిలబడటం వింటుంటాం. తాజాగా, అనారోగ్యంతో ఉన్న తన అభిమానికి సూపర్‌స్టార్ ఇచ్చిన స్ర్ప్రైజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. తన అభిమాని కోసం చాలా ప్రత్యేకమైన వీడియో సందేశాన్ని పంపించారు రజనీ. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. వ్యక్తిగతంగా కలవడం వీలుకానందుకు క్షమించాలని కోరారు.

కాగా, బెంగళూరుకు చెందిన రజనీ అభిమాని సౌమ్య గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్తరిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ సర్ప్రైజ్ వీడియోలో రజనీ మాట్లాడుతూ.. హలో సౌమ్య. ఎలా ఉన్నారు. త్వరలోనే మీరు పూర్తి ఆరోగ్యవంతులవుతారు. కరోనా కారణంగా నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవడం కుదలేదు. దానికి తోడు నాకు కూడా ఆరోగ్యం సరిగా లేదు. లేకపోతే కచ్చితంగా మిమ్మల్ని కలిసేందుకు వచ్చేవాడిని. మీకు ఆ దేవుడు అండగా ఉన్నాడు. ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకండి అని చెప్పారు. అస్సలు వర్రీ అవ్వొద్దని.. త్వరగానే కోలుకుంటారని.. భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.