Rajinikanth : ఆ సంవత్సరం మహేష్ బాబు, ఎన్టీయార్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్…సూపర్ స్టార్ తో మామూలుగా ఉండదు…

Rajinikanth రజినీకాంత్ రోబో సినిమా వచ్చిన వారం తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన 'ఖలేజా ' సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఖలేజా వచ్చిన రెండు రోజులకు ఎన్టీఆర్ హీరోగా చేసిన 'బృందావనం' సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ టాక్ ని సంపాదించుకున్నప్పటికి వసూళ్లను మాత్రం భారీగా సంపాదించలేకపోయింది.

Written By: NARESH, Updated On : July 7, 2024 9:36 pm

Rajinikanth shocked Mahesh Babu and NTR

Follow us on

Rajinikanth : తమిళ్ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్న హీరో రజనీకాంత్. ఇక ఆయనకు తమిళనాడులో ఎలాంటి మాస్ ఫాలోయింగ్ అయితే ఉందో తెలుగులో కూడా అంతటి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని ఇక్కడ కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు. ఇక అలాంటి రజినీకాంత్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.

ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక అలాగే ‘జైలర్ 2’ సినిమాని కూడా తొందర్లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే 2010 సంవత్సరంలో రజనీకాంత్ ‘రోబో ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించి భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా అప్పట్లోనే దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది.

రజినీకాంత్ రోబో సినిమా వచ్చిన వారం తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ఖలేజా ‘ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఖలేజా వచ్చిన రెండు రోజులకు ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘బృందావనం’ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ టాక్ ని సంపాదించుకున్నప్పటికి వసూళ్లను మాత్రం భారీగా సంపాదించలేకపోయింది.

ఇక ఈ సినిమాలు భారీ వసూళ్లను సాధించకపోవడానికి ముఖ్య కారణం రజినీకాంత్ రోబో సినిమా అని అప్పట్లో చాలా కథనాలైతే వచ్చాయి. మొత్తానికైతే రజనీకాంత్ తెలుగులో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలకి షాక్ ఇస్తూ భారీ వసూళ్లను రాబట్టడం చూస్తుంటే రజనీకాంత్ కి తెలుగులో ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ప్రస్తుతం రజినీకాంత్ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు…