Rajinikanth : బాక్సాఫీస్ కింగ్ రజినీకాంత్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ ఇండియా నుండి ఆయన ఫస్ట్ పాన్ ఇండియా హీరో అనడంలో సందేహం లేదు. ఏడుపదుల వయసులో ఉన్న రజినీకాంత్ ఇమేజ్ ఇంచు కూడా తగ్గలేదు. కోలీవుడ్ లో ఇప్పటికీ టాప్ పొజీషన్ ఆయనదే. జైలర్ మూవీతో రజినీకాంత్ వసూళ్లు కుమ్మేశాడు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ చిత్రానికి రజినీకాంత్ రూ. 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ వద్దు అంటూ ‘కూలీ’ మేకర్స్ కి రజినీకాంత్ హెచ్చరిక!
సీనియర్ హీరోల్లో రజినీకాంత్ మాత్రమే దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ఉన్నారు. కాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఫస్ట్ టైం రజినీకాంత్ మూవీ చేస్తున్నారు. కూలీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో లెక్కకు మించిన స్టార్స్ భాగమయ్యారు. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఓ కీలక రోల్ చేస్తున్నాడు. ఆయన లుక్ లీక్ కాగా మైండ్ బ్లాక్ చేస్తుంది. అమిర్ ఖాన్, ఉపేంద్ర, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూలీ మూవీలో తళుక్కున మెరవనున్నారు.
శ్రుతి హాసన్ సైతం కూలీ మూవీలో నటిస్తుంది. ఇటీవల పూజ హెగ్డే ను పరిచయం చేశారు. పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేసిందని ప్రచారం నడుస్తుంది. కాంబినేషన్ రీత్యా కూలీ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ క్రమంలో ఓటీటీ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. కూలీ మూవీ డిజిటల్ రైట్స్ రూ. 120 కోట్లు పలికాయట. ఫ్యాన్సీ ధర చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ రైట్స్ ఆ రేంజ్ లో ఉంటే ఇక థియేట్రికల్ బిజినెస్ ఆకాశమే హద్దుగా సాగడం ఖాయం. నాగార్జున నటిస్తున్న కారణంగా తెలుగు థియేట్రికల్ రైట్స్ కి హైప్ నెలకొననుంది.
కూలీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామా అని సమాచారం. లోకేష్ కనకరాజ్ విక్రమ్ రూపంలో కమల్ హాసన్ కి భారీ హిట్ ఇచ్చాడు. కమల్ కి విక్రమ్ కమ్ బ్యాక్ మూవీ అయ్యింది. ఇక రజినీకాంత్ కి అంతకు మించిన హిట్ ఇస్తాడనిపిస్తుంది.
Also Read : ‘రజినీకాంత్’ థియేటర్ కూల్చివేత..అక్షరాలా 40 ఏళ్ళ చరిత్ర..శోకసంద్రంలో ఫ్యాన్స్!