https://oktelugu.com/

Rajinikanth-Rama Prabha: ఆ హీరో చేతిలో మోసపోయిన రమాప్రభ.. ఆర్థికసాయం కోసం రజనీ కాంత్ ఇంటికి వెళ్తే..ఏమ్మన్నారో తెలుసా ?

Rajinikanth-Rama Prabha: సౌత్ ఇండియా లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే ముందుగా రజనీ కాంత్ పేరునే చెబుతారు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఎవ్వరికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఈయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా దాదాపు 70 కోట్ల పారితోషికం తీసుకునేంత క్రేజ్ రజనీ కాంత్ కు మాత్రమే ఉంది. ఇంత […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 1, 2022 / 12:13 PM IST
    Follow us on

    Rajinikanth-Rama Prabha: సౌత్ ఇండియా లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే ముందుగా రజనీ కాంత్ పేరునే చెబుతారు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఎవ్వరికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఈయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా దాదాపు 70 కోట్ల పారితోషికం తీసుకునేంత క్రేజ్ రజనీ కాంత్ కు మాత్రమే ఉంది.

    Rajinikanth

    ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న.. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కూడా రజనీ కాంత్ ఎప్పుడు ‘డౌన్ టు ఎర్త్’ అనే విధంగానే కనిపిస్తారు.. అలానే ఉంటారు కూడా.. ముఖ్యంగా ఈయన సాయం చేయడంలో ముందు ఉంటారని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటుంటారు. కష్టం ఉందని ఎవరైనా ఆయన వద్దకు వెళ్తే చుసిన వెంటనే చలించి వారికీ ఏ సహాయం కావాలని వెంటనే ఆలోచించ కుండా సహాయం చేసే మంచి మనసు అని అంత చెబుతుంటారు.

    Rama Prabha

    Also Read: న్యూ ఇయర్ వేళ అభిమానులకు షాక్ ఇచ్చిన దీప్తి సునైనా… ఏం జరిగిందంటే ?

    రజనీ కాంత్ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. అందుకే ఆయనకు కష్టం విలువ తెలుసు. ఇప్పటి వరకు రజనీ కాంత్ దగ్గరకు ఎంతో మంది సహాయం కోసం వెళ్లారు.. వారందరికీ ఆయన ఆర్ధికంగా సహాయం చేసారు. రజనీ కాంత్ సహాయం పొందిన వారిలో సీనియర్ నటి రామ ప్రభ కూడా ఉన్నారట. ఈమె తెలుగు, తమిళ భాషల్లో కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.

    అప్పట్లో హీరో శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత అతడి చేతిలో మోసపోవడమే కాకుండా.. తాను సంపాదించు కున్న ఆస్తిని కూడా పోగొట్టుకుని రోడ్డున పడిందట. కట్టుబట్టలతో రోడ్డున పడిన రోజున సహాయం కోసం రజనీ కాంత్ ఇంటికి వెళ్లిందట రామ ప్రభ. ఆమె పరిస్థితికి రజనీ కాంత్ చాలా బాధపడి అప్పట్లోనే తన దగ్గర ఉన్న 40 వేల రూపాయలను ఇచ్చేసారట. ఏదో దారి ఖర్చులు లేదా తినడానికి కొంత డబ్బు ఇస్తాడని ఆశించిన రామ ప్రభ కు రజనీ ఇచ్చిన డబ్బు చాలా కష్టాల నుండి బయట పడేసిందట. ఆ విషయాన్నీ రామ ప్రభ ఇప్పటికి గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

    Also Read: అదేంటి ? సమంతను ఎందుకు తీసుకున్నారు ?

    Tags