Rajinikanth On Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి… ఈయన వరుస సక్సెస్ లతో మంచి స్టార్ డమ్ అందుకొని మొదట సుప్రీం హీరో గా ఆ తర్వాత మెగాస్టార్ గా మారాడు ఒకానొక సమయం లో వరుసగా 6 సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లను అందుకున్న అందుకున్న ఏకైక హీరోగా కూడా చిరంజీవి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తమిళ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ని అందుకొని అక్కడ చాలా సంవత్సరాల పాటు మంచి గుర్తింపు పొందుతున్నాడు.
అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని డైరెక్టర్ సురేష్ కృష్ణ చాలావరకు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయనకు చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరి తో కూడా మంచి సన్నిహిత్యం ఉండేది. రజనీకాంత్ తో భాషా అనే సినిమా చేశాడు. అలాగే చిరంజీవితో మాస్టర్ అనే సినిమా చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు చేయడం వల్ల వీళ్లిద్దరి తో ఆయనకి మంచి ర్యాపో అయితే ఉంది.
అయితే చిరంజీవి, రజనీకాంత్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. అయితే చిరంజీవి రజనీకాంత్ కి డాన్స్ రాదు అందువల్లే నేను ఆయనతో మల్టీ స్టారర్ సినిమా చేయాలనుకోవడం లేదు అని అన్నాడని మధ్యలో కొంతమంది కొన్ని పుకార్లను క్రియేట్ చేసి రజనీకాంత్ కి చెప్పారట. దాంతో రజనీకాంత్ చిరంజీవిని అపార్థమైతే చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒక రోజు ఒక పబ్లిక్ ఫంక్షన్ వీళ్లిద్దరు కలిసినప్పుడు ఇలా సురేష్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా అనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదు అని చిరంజీవి రజనీకాంత్ తో చెప్పాడట.
దాంతో రజనీకాంత్ ఫన్నీగా నాకు డాన్స్ రాదని నాతో సినిమా నువ్వే వద్దన్నావంట కదా చిరు అని రజినీకాంత్ అనడం తో చిరంజీవి ఒక్కసారి గా షాక్ అయి నేను అలా ఎందుకు అన్నాను. కథ కరెక్ట్ కుదరడం లేదు మంచి కథ దొరికిన తర్వాత ప్లాన్ చేద్దామని డైరెక్టర్ సురేష్ కృష్ణ నాతో చెప్పాడు అని చిరు చెప్పి అక్కడే ఉన్న సురేష్ కృష్ణుని పిలిచి అడిగితే సురేష్ కృష్ణ కూడా కథ సెట్ అవ్వకపోవడం వల్లే సినిమాను పోస్టు పోన్ చేశాను తొందరలోనే మళ్లీ ఈ సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పాడట. దాంతో రజనీకాంత్ చిరంజీవిని అనవసరంగా అపార్థం చేసుకున్నానే అంటూ తనలో తానే అనుకోని చిరంజీవి తో కలిసి చాలాసేపు మాట్లాదినట్టు గా అప్పట్లో చాలా వార్తలు అయితే వచ్చాయి.ఇక చిరంజీవి అంటే గిట్టని వాళ్లే ఇలాంటి పుకార్లని సృష్టించారు అంటూ అప్పట్లో చాలా దీనిమీద చాలా కథలు వచ్చాయి… ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబో లో రావాల్సిన సినిమా ఇప్పటివరకు కూడా ఇంకా పట్టాలెక్కలేదు…