Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కాకరేపుతున్నాయి. జైలర్ ప్రీ రిలీజ్ వేదికగా రజినీకాంత్ ఎవరికో కౌంటర్ వేశాడని చర్చ నడుస్తుంది. అయితే అవి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అని కొందరు భావిస్తున్నారు. బ్రో మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ తమిళ పరిశ్రమకు కొన్ని సూచనలు చేశారు. చిత్ర పరిశ్రమ ఎదగాలంటే అందరినీ ఆహ్వానించాలి. భాషా, ప్రాంతీయ భేదాలు లేకుండా టాలెంట్ ని గుర్తించాలి. అప్పుడే పరిశ్రమ ఎదుగుతుంది.
తమిళ పరిశ్రమలో తమిళ నటులు, సాంకేతిక నిపుణులే ఉండాలను కోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి సంకుచిత భావాల వలన పరిశ్రమ వెనకబడిపోతోంది. తెలుగు పరిశ్రమ అందరినీ ఆదరిస్తుంది. అందుకే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది, అన్నారు. తమిళ పరిశ్రమ ఈ విషయంలో తమ వైఖరి మార్చుకోవాలి అన్నారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కోలీవుడ్ ప్రముఖులను హర్ట్ చేశాయి. నాజర్ వంటి సీనియర్ నటుడు స్పందించాడు కూడాను. ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు.
పవన్ కళ్యాణ్ ని ఎవరో తప్పుదోవ పట్టించారు. ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ వేరు. ఆర్కే సెల్వమణి కేవలం తమిళ పరిశ్రమ మీద ఆధారపడిన వేల మంది కార్మికుల ప్రయోజనాలు, ఉపాధి గురించి మాట్లాడారని అన్నారు. ఇది జరిగి రెండు వారాలు గడిచిపోగా రజినీకాంత్ జైలర్ ప్రీ రిలీజ్ వేడుకలో విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే అన్నట్లు కొటేషన్ కొట్టాడు.
‘మొరగని కుక్కలేదు… విమర్శించని నోరు లేదు… ఈ రెండు జరగని ఊరు లేదు. మనం మన పని చేసుకుంటూ పోవడమే… అర్థమైందా రాజా!’. రజినీకాంత్ కామెంట్స్ కి వేదిక దద్దరిల్లిపోయింది. ఈ కామెంట్స్ తమిళ పరిశ్రమను విమర్శించిన పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేశారని ఓ వర్గం వాదన. మరొక వర్గం వాదన వేరేలా ఉంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తిన రజినీకాంత్ వైసీపీ నాయకుల ఆగ్రహానికి గురయ్యాడు. వారు విమర్శలు గుప్పించారు. ఆయన చెప్పిన ఈ డైలాగ్ వారి గురించే అంటున్నారు. చర్చ మాత్రం జరుగుతుంది…
https://twitter.com/SumaTiyyaguraa/status/1688974880484757504?s=20