KH x RK Reunion glimpse: తమిళ సినిమా ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు రజినీకాంత్(Superstar Rajinikanth), కమల్ హాసన్(Kamal Hassan). ఇప్పుడైతే చాలా మంది హీరోలు వచ్చారు కానీ, ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే వీళ్లిద్దరి పేర్లే అందరికీ గుర్తుకు వచ్చేవి. వీళ్ళ స్టామినా ని కేవలం తమిళనాడు కి మాత్రమే పరిమితం చేయకుండా, అన్ని భాషల్లోనూ విస్తరిస్తూ తమిళ సినిమా ఇండస్ట్రీ కి తిరుగులేని మార్కెట్ ని క్రియేట్ చేశారు. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలయిక లో ఒక మల్టీస్టార్రర్ చిత్రం చేస్తే చూడాలని ప్రతీ ఒక్కరికి కోరిక ఉంటుంది. ఈ జనరేషన్ కుర్రాళ్ళు వీళ్ళ కాంబినేషన్ లో ఫోటోలు చూసి ఉంటారు, సినిమాని మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. వీళ్లిద్దరి కెరీర్ ప్రారంభం కొత్తల్లో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అత్యధిక శాతం చిత్రాల్లో కమల్ హాసన్ హీరో కాగా, రజినీకాంత్ విలన్ గా నటించాడు.
కానీ ఇద్దరికీ సూపర్ స్టార్ స్టేటస్ లు వచ్చిన తర్వాత కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే వీళ్ళ కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రాబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్, జైలర్ 2 వంటి చిత్రాలను చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం ఒక స్పెషల్ ప్రోమో వీడియో ని షూట్ చేశారు. అది నేడు కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియో లో రజినీకాంత్, కమల్ హాసన్ స్టైలిష్ నడక వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఇద్దరు కూడా ఒకరికి ఇష్టమైనది ,మరొకరికి ఇష్టం ఉండదు. అంటే దీని అర్థం ఏంటంటే ఇద్దరి మధ్య సినిమాలో క్లాష్ భీభత్సంగా ఉండబోతుంది అని ఈ చిన్న గ్లింప్స్ ద్వారా చెప్పకనే చెప్పాడు డైరెక్టర్.
ఇక గ్లింప్స్ చివర్లో వీళ్లిద్దరు కారులో కూర్చోవడం, వీళ్ళ వెనుక సీట్ లో అనిరుద్, నెల్సన్ కూర్చోవడం, ఇంతకీ ఈ చిత్రం లో హీరో ఎవరు అని ఇద్దరు హీరోలు అడగడం, సమాధానం చెప్పలేక నెల్సన్, అనిరుద్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్న సమయంలో ‘రయ్’ అంటూ కారుని ఇద్దరు హీరోలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం వంటివి చూపించారు. దీని అర్థం ఏంటంటే, ఈ సినిమాలో ఇద్దరు హీరోలే అని ఈ చివరి షాట్ తో చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్. త్వరలోనే ఈ క్రేజీ మల్టీస్టార్రర్ కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని వండర్స్ క్రియేట్ చేయబోతుంది అనేది.
