spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Jailer 2 Delay Reasons: 'జైలర్ 2' ఔట్పుట్ పై సూపర్ స్టార్ రజినీకాంత్...

Rajinikanth Jailer 2 Delay Reasons: ‘జైలర్ 2’ ఔట్పుట్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ అసంతృప్తి.. ఇప్పట్లో విడుదల కష్టమే..

Rajinikanth Jailer 2 Delay Reasons: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కి అత్యంత కీలకమైన సమయం లో విడుదలైన ‘జైలర్'(Jailer Movie) చిత్రం ఆయన కెరీర్ లో ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం నుండి సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న సమయం అది, మరో పక్క అజిత్ , విజయ్ వంటి వారు యూత్ ఆడియన్స్ లో దూసుకొని వెళ్తున్నారు, అలాంటి సమయంలో రజినీకాంత్ కి వరుస ఫ్లాప్స్ రావడం తో ఇక ఆయన పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ‘జైలర్’ చిత్రం తో ఆయన సృష్టించిన ప్రభంజనం చూసి, ఇది కదా రజినీకాంత్ రేంజ్ అంటే అని ఆయన అభిమానులు మీసం మెలేసారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి దాదాపుగా 670 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా ‘జైలర్ 2′(Jailer 2 Movie) చిత్రం తెరకెక్కుతోంది.

గత కొంతకాలం క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ , ఎలాంటి విరామం లేకుండా నాన్ స్టాప్ గా సాగుతూనే ఉంది. దాదాపుగా చివరి దశకు కూడా వచ్చేసింది. అయితే రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ ని చూశాడట రజినీకాంత్. ఎందుకో ఆయనకు చాలా సన్నివేశాలు రిపిటీటివ్ గా అనిపించాయట. కొన్ని అయితే అసలు నచ్చలేదట. దీంతో ఈ సన్నివేశాలు రీ షూట్ చెయ్యమని రజినీకాంత్ ఆదేశించడం తో , రీసెంట్ గానే రీ షూటింగ్ ని మొదలు పెట్టారట. దీంతో ముందుగా అనుకున్న దానికంటే ఒక నెల రోజుల ఎక్కువ సమయం ఈ సినిమా చిత్రీకరణ కోసం అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ ఏడాదిలోనే విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, ప్రస్తుతానికి అయితే 50-50 అవకాశాలు మాత్రమే ఉన్నాయట త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ , రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మల్టీస్టార్రర్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు లేవు. ‘జైలర్ 2’ పూర్తి అయ్యాక కమల్ హాసన్ నిర్మాణం లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు రజినీకాంత్. అది పూర్తి అయినా తర్వాతనే కమల్ హాసన్ తో మల్టీస్టార్రర్ సినిమా ఉండబోతుంది. అయితే ఆ చిత్రానికి వేరే లెవెల్ బజ్ రావాలంటే కచ్చితంగా ‘జైలర్ 2’ పెద్ద హిట్ అవ్వాల్సిందే. మరి నెల్సన్ ఎలా డీల్ చేశాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version