Rajinikanth : ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ఎమోషన్ కూడా భారీగా వర్కౌట్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది. దానివల్లే సినిమా అనేది సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా భారీ విజయాలను కూడా నమోదు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి సినిమాలు ఎలా ఉన్నా కూడా సినిమాలో సీన్ల తాలూకు ఎమోషన్ అనేది ప్రాపర్ గా వర్క్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అందువల్లే దర్శకులు ఆ సినిమాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంటుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమ సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తమదైన రీతిలో భారీ గుర్తింపును సంపాదించుకున్న తెలుగు హీరోలకు పోటీని ఇస్తూ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందిన రజనీకాంత్ సైతం భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే… ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు. అయితే రజనీకాంత్ తన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు మాత్రం ఆయనకు చాలా వరకు బాధ అనిపించిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే బాబా సినిమాగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి కథని రజినీకాంత్ అందించాడు.
ఇక సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని రజనీకాంత్ అనుకున్నప్పటికి ఈ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించకపోగా కారణం ఏంటి అంటే ఇందులో ఆధ్యాత్మికమైన విషయాలను జోడించడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ కొంతమంది చెబుతుంటే ఆధ్యాత్మిక విషయాల వల్ల ఈ సినిమా అంత బాగా వచ్చింది.
కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మూడు రోజుల వరకు ఆయన అన్నం తినకుండా నిద్రపోకుండా ఉన్నారట. ఎందుకు అంటే ఆయన ప్రాణం పెట్టి ఆ కథను రాసుకున్నట్టుగా తెలియజేశాడు. మరి మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో బాబా సినిమా కూడా అలాంటి ఒక సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని అందరు అనుకున్నారు.
కానీ దానికి భిన్నంగా ఈ సినిమా రిజల్ట్ ఉండడంతో ఆయన రిజల్ట్ ను జీర్ణించుకోలేకపోయినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా రజినీకాంత్ లాంటి స్టార్ హీరో కూడా తన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొంటాడన్న విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…