Salaar 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా అవతరిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో దాదాపు 2000 కోట్ల మార్క్ ను టచ్ చేసిన ప్రభాస్ సలార్, కల్కి లాంటి సినిమాలతో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికి ప్రభాసే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు…
ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (prashanth neel) దర్శకత్వంలో వచ్చిన సలార్ (Salar) సినిమా బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ తన ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాడు…మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ హీరోలకి సైతం కంటి మీద కునుకు లేకుండా చేసింది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు సలార్ 2(Salar 2)సినిమాకు సంబంధించిన కథ రెడీ చేసి పెట్టిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ (NTR)తో చేస్తున్న డ్రాగన్ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా మీద భారీ కసరత్తులను చేయాలని చూస్తున్నాడట. అలాగే సలార్ 2 సినిమాను కూడా చాలా తొందరగా సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడట. మరి 2026 ఎండింకల్లా ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి 2027 వ సంవత్సరంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక అప్పటి వరకు ప్రభాస్ కమిట్ అయిన అన్ని సినిమాలు పూర్తయిపోతాయి. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో చేయాల్సిన డ్రాగన్ సినిమాని కంప్లీట్ చేసి ఫ్రెష్ గా ఉంటాడు. కాబట్టి అప్పుడు ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి ఈ సినిమాని చేయాలనే ప్రయత్నం లో ఉన్నారు…
ఇక సలార్ 2 శౌర్యంగ పర్వంగా తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో అయిన రజినీకాంత్ (Rajinikanth) కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శౌర్యాంగుల పెద్దగా తను ఈ సినిమాలో నటించబోతున్నారట. ఇక తనకోసం ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందట.
ప్రభాస్ రజనీకాంత్ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించక పోయినా కూడా శౌర్యంగులు తమ వంశానికి సంబంధించిన గొప్ప వ్యక్తుల గురించి ప్రభాస్ కి తెలియజేస్తూ రజనీకాంత్ గురించి చెబుతారట. మరి ఆయన పాత్ర ఈ సినిమాలో ఒక గొప్ప యోధుడిగా ఉండబోతుందట…మరి ఇలాంటి సందర్భంలోనే రజినీకాంత్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కూలీ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ‘జైలర్ 2’ సినిమాని కంప్లీట్ చేసి సలార్ 2 సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ మాత్రం ఈ విషయం మీద ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుందనే చెప్పాలి…