Rajinikanth- Rakshit Shetty: హీరో రక్షిత్ శెట్టి ఆనందానికి హద్దులు లేవు. ఆయన గాల్లో తేలుతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన చిత్రాన్ని ప్రశంసించడమే అందుకు కారణం. రక్షిత్ శెట్టి నటించిన ప్రయోగాత్మక చిత్రం 777 చార్లీ. జూన్ 10న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంది. 777 చార్లీ చిత్రంపై క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే చిత్ర ప్రముఖుల నుండి అభినందనలు దక్కుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో రజినీకాంత్ చేరారు. రజినీకాంత్ 777 చార్లీ చిత్రం చూడటం తో పాటు హీరో రక్షిత్ శెట్టికి ఫోన్ చేసి మాట్లాడారట. ఈ విషయాన్ని రక్షిత్ శెట్టి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

అద్భుతమైన రోజు… రజినీకాంత్ సార్ నుండి కాల్ వచ్చింది. గత రాత్రి ఆయన 777 చార్లీ చిత్రం చూశారు. ఆయనకు ఎంతగానో నచ్చేసిందని చెప్పారు. సినిమా నిర్మాణ విలువలు, డిజైన్ గురించి గొప్పగా పొగిడారు. క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా కొనియాడారు.. అంటూ రక్షిత్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి రజినీకాంత్ లాంటి బడా స్టార్ కి సినిమా నచ్చడం అంటే మామూలు విషయం కాదు కదా.అందుకే రక్షిత్ అంతగా ఉబ్బితబ్బిబవుతున్నాడు.
Also Read: Anasuya In Bigg Boss 6: బిగ్ బాస్ 6 లో అనసూయ..? ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందో తెలుసా?

ఓ మనిషి జీవితాన్ని పెంపుడు కుక్క ఎలా మార్చింది అనేది 777 చార్లీ నేపథ్యం. ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ పలువురిని కదిలిస్తుంది. 777 చార్లీ చిత్రం చూసిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన పెంపుడు కుక్క అనారోగ్యంతో మరణించింది. 777 చార్లీ సినిమా చూసిన సీఎం బసవరాజ్ చనిపోయిన పెట్ డాగ్ ని తలచుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక జంతు ప్రేమికురాలు యాంకర్ రష్మీ గౌతమ్ 777 చార్లీ చిత్రం అందరూ చూడాలంటూ కోరారు. మూగజీవాల గొప్పదనం ఈ చిత్రంలో బాగా చెప్పారని, పెంపుడు జంతువులు జీవితాలు మార్చగలవనేది నిజమని ఆమె తెలియజేశారు. 777 చార్లీ చిత్రానికి కిరణ్ రాజ్ కె దర్శకత్వం వహించారు.
Also Read:Anchor Pradeep: ఢీ షోకి గుడ్ బై చెప్పబోతున్న యాంకర్ ప్రదీప్
[…] Also Read: Rajinikanth- Rakshit Shetty: సినిమా చూసి ఆ యంగ్ హీరోకి క… […]