Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పాటలు భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై వేరే లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా, ఈ సినిమా గురించి మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ సీరియస్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. రాజకీయ నాయకుడి పాత్ర అయ్యుంటుందని ఇండస్ట్రీలో టాక్. కాగా, ఇప్పటి వరకు మంచి కమెడియన్ ఆర్టిస్ట్‌గా క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తంపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్.. ఇందులో పూర్తి భిన్నమైన పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వెలువడేంతవరకు వేచి చూడాల్సిందే.
కాగా, భీమ్లానాయక్లో పవన్ సరసన నిత్యామేనన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ను వివరిస్తూ.. ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో, ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్‌తో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. కాగా, ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించనున్నారు.