Rajendra Prasad and Naresh : ఒకప్పుడు కామెడీ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నరేష్(Actor Naresh). సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna) సతీమణి విజయ్ నిర్మల మొదటి భర్త కొడుకే నరేష్. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ ఏనాడు కూడా ఆయన సినిమా అవకాశాల కోసం కృష్ణ, విజయ్ నిర్మల పేర్లను వాడుకోలేదు. కామెడీ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ దారిలోనే ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఆరోజుల్లో కామెడీ హీరోలంటే రాజేంద్ర ప్రసాద్(Natakireeti Rajendra Prasad), నరేష్ మాత్రమే. హీరో గా నరేష్ కంటే రాజేంద్ర ప్రసాద్ అత్యధిక సక్సెస్ లు చూసాడు, కానీ క్యారక్టర్ ఆర్టిస్టుగా మాత్రం రాజేంద్ర ప్రసాద్ కంటే నరేష్ ఎక్కువ సక్సెస్ లు చూసాడు. ఇప్పటికీ నరేష్ కి ఉన్నంత డిమాండ్ టాలీవుడ్ లో ఏ సీనియర్ హీరోకి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
Also Read : అలాంటి హీరోలు రాకపోవడం లేకపోవడం విచిత్రమే !
అయితే నరేష్ రీసెంట్ తనని తాను రాజేంద్ర ప్రసాద్ తో పోలుస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘ఆరోజుల్లో కామెడీ హీరోలంటే నేను, రాజేంద్ర ప్రసాద్ మాత్రమే. మా ఇద్దరి మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. మా ఇద్దరిలో ఎవరు గొప్ప నటుడు అంటే ఎవరికైనా చెప్పడం కష్టమే. నేను పోషించిన పాత్రలను రాజేంద్ర ప్రసాద్ చేయలేడు, అదే విధంగా ఆయన పోషించిన పాత్రలను నేను చేయలేను. కానీ నా దృష్టిలో మాత్రం నేనే రాజేంద్ర ప్రసాద్ కంటే గొప్ప నటుడుని. అలా అనుకోకపోతే చాలా కష్టం. నిన్ను నువ్వు ప్రేమించుకోనప్పుడు, బయట వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు?’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్. ఆయన మాటల సంగతి కాసేపు పక్కన పెడితే రాజేంద్ర ప్రసాద్ నరేష్ కంటే అద్భుతమైన నటుడు అనేది జనాల అభిప్రాయం.
ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కామెడీ ని ఇష్టపడని వాళ్లంతా ఎవ్వరూ ఉండరు. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కూడా ఆయన కామెడీ ని ఎంజాయ్ చేస్తారు. కానీ నరేష్ కామెడీ ఆ రేంజ్ లో ఉండదు. అయితే నరేష్ అన్ని రకాల పాత్రలు పోషించాడు. అలాంటి పాత్రలు రాజేంద్ర ప్రసాద్ ఇంకా అద్భుతంగా చేయగలడు. ఉదాహరణకు ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ వంటివి ఎన్నో ఉన్నాయి. కామెడీ లో రాజేంద్ర ప్రసాద్ తో సమానం కాదు కానీ, క్యారక్టర్ రోల్స్ లో మాత్రం నరేష్ రాజేంద్ర ప్రసాద్ ని మ్యాచ్ చేయగలడు. కానీ రాజేంద్ర ప్రసాద్ కి కామెడీ లో భారీ ఎడ్జ్ ఉండడం తో ఆయనే గొప్ప నటుడని నెటిజెన్స్ అభిప్రాయం. రీసెంట్ గానే నరేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో సీఎం క్యారక్టర్ చేసి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రాజేంద్ర ప్రసాద్ నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రంలో నటించాడు. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.
Also Read : రాజేంద్ర ప్రసాద్ కారణంగా నా కెరీర్ సర్వ నాశనం అయ్యింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!