Rajeev Kanakala: కొత్తగా పెళ్ళైన జంటలు ఆదర్శంగా తీసుకొని జీవితాంతం కలిసి ఉండాలి, కలిసి నడవాలి అని ప్రభావితం చేసే జంటలలో ఒకటి సుమ(Suma Kanakala), రాజీవ్ కనకాల(Rajeev Kanakala) జంట. వీళ్లిద్దరి పెళ్లి 1999 వ సంవత్సరం లో ఫిబ్రవరి 10 న జరిగింది. అప్పట్లో వీళ్లిద్దరు కలిసి ‘కస్తూరి’ అనే సీరియల్ చేశారు. ఆ సీరియల్ ద్వారా వీళ్ళ మధ్య ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపుగా 26 ఏళ్ళ నుండి దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోయంగా సాగిస్తూ ఎంతో మందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు. ఈ 26 ఏళ్లలో వీళ్ళ మధ్య ఎన్నో విబేధాలు, గొడవలు వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పటి తరం జంటలు లాగా విడాకులే పరిష్కారం అనుకోలేదు. కూర్చొని చర్చించుకొని దిగ్విజయంగా దాపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు.
Also Read: ఓదెల 2′ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రొమోషన్స్ ఖర్చులు కూడా రాలేదు!
వీళ్లిద్దరు విడిపోతున్నారు అంటూ ఈమధ్య కాలంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని వీళ్లిద్దరు అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూస్ లో తెలిపారు. అంతే కాకుండా ఈ జంట ఈమధ్య కాలం లో అప్పుడప్పుడు కలిసి కొన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా లో రాజీవ్ కనకాల సుమని అక్కా ని పిలిచిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సుమ రాజీవ్ కనకాల ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రపంచం లోనే మీరు చూసిన అత్యంత అందమైన అమ్మాయి ఎవరు?’ అని అడుగుతుంది. దానికి రాజీవ్ కనకాల ఆలోచిస్తున్న సమయంలో ఆడియన్స్ ‘సుమక్కా..సుమక్కా’ అని అరుస్తూ ఉంటారు. అప్పుడు రాజీవ్ కనకాల ‘హా..సుమక్కేలే’ అని అంటాడు. అప్పుడు సుమ ‘సుమక్కే లే నా?’ అని సీరియస్ గా అడగగా, ‘నేను మీ సుమక్క అని ఆడియన్స్ ని ఉద్దేశించి అన్నాను’ అని అంటాడు రాజీవ్ కనకాల.
అప్పుడు సుమ ‘ఏంటోలే..మీరు మనస్ఫూర్తిగా చెప్పినట్టుగా అనిపించలేదు..ఇంటికి రండి మాట్లాడుకుందాం’ అని అంటుంది. ఇదంతా వీళ్లిద్దరి తనయుడు రోషన్ హీరో గా నటించిన ‘బబ్లీ గమ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. ఈ సినిమా ప్రొమోషన్స్ ని అప్పట్లో దంచికొట్టేసారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమాకు నిర్మాతలుగా రాజీవ్ కనకాల, సుమ లే వ్యవహరించారు. కానీ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యిందని, మేము చాలా నష్టపోయామని, కేవలం ఓటీటీ, సాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చిన డబ్బులు కాస్త మిగిలాయని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. కానీ రోషన్ నటనకు మంచి మార్కులు పడ్డాయని, ఇప్పుడు వాడు వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చూడాలి మరి రోషన్ భవిష్యత్తుల సక్సెస్ అవుతాడా లేదా అనేది.
Also Read: రకుల్ ప్రీత్ సింగ్ టార్చర్ తట్టుకోలేక నాగార్జున అలాంటి పని చేశాడా!
