చాలా రోజుల తర్వాత రాజశేఖర్ నుంచి వచ్చిన ‘గరుడవేగం’ భారీ విజయం సాధించింది. దీని తర్వాత వచ్చిన ‘కల్కి’ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా వీరభద్రం చౌదరి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథను రాజేశేఖర్ కోసం సిద్ధం చేయగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లలో మూవీ తెరకెక్కుతుంది. వీరభద్రం చౌదరి ‘అహ నా పెళ్ళంట’, ‘పూలరంగడు’ మంచి సినిమాలతో సక్సస్ అందుకున్నాడు. నాగార్జున తీసిన ‘భాయ్’, ఆదితో తీసిన ‘చుట్టాలబ్బాయి’ మూవీలు అనుకున్నంత విజయాలు సాధించకపోవడంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి ఎలాగైన విజయం కొట్టాలని హీరో రాజశేఖర్ తో కలిసి పని చేస్తున్నాడు.
రాజశేఖర్ ఇటీవల కాలంలో సినిమాలకంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. కారు యాక్సిండెంట్, మా వైస్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా వంటి ఇష్యూలతో ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తిరిగి సినిమాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నటిస్తూ భారీ విజయం అందుకుని సినిమాల్లో బీజీగా కావాలని భావిస్తున్నాడు. ఈ సినిమా విజయానికి శాయశక్తుల కృషి చేస్తున్నాడు. యంగ్రీ యంగ్ మేన్ కు శ్రియ గ్లామర్ తోడవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అదేవిధంగా శ్రియ దర్శకుడు బొయపాటి-బాలయ్య కాంబినేషన్లో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. శ్రియ గ్లామర్ రాజశేఖర్ మూవీకి కలిసి వస్తుందో లేదో చూడాలి.