The Raja Saab Telugu Trailer : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. జనవరి లో విడుదల అవ్వబోయే సినిమాకు ఇప్పుడే ట్రైలర్ వదలడం ఏంటి?, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే అనుమానం ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్, అదే విధంగా నాన్ థియేట్రికల్ రైట్స్ నిర్మాతలు ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదు. అందుకే ముందుగా ఒక ట్రైలర్ ని విడుదల చేసి, దాని ద్వారా వచ్చే హైప్, క్రేజ్ తో బిజినెస్ చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఈ ట్రైలర్ ని కట్ ని విడుదల చేశారు. ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటున్న ఈ ట్రైలర్ ఎలా ఉంది?, ఇందులోని ప్లస్సులు, మైనస్సులు గురించి ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము.
ప్లస్సులు :
ట్రైలర్ లో ఉన్న అతి పెద్ద ప్లస్, ప్రభాస్ మాత్రమే. డైరెక్టర్ మారుతీ ఆయనలోని కామెడీ టైమింగ్ మొత్తాన్ని బయటకు తీసుకొచ్చినట్టు కొన్ని షాట్స్ ని చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ డైలాగ్స్ చాలా ఫన్నీ గా ఉన్నాయి. అదే విధంగా గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగానే ఉంది. మంచి క్వాలిటీ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీ సినిమాకి ఇచ్చినట్టే,ఈ ట్రైలర్ కి కూడా తన మార్క్ ని చూపించాడు. ఇక హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి వారు కూడా ప్రభాస్ కి పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఇక ట్రైలర్ చివర్లో ప్రభాస్ రాజు గెటప్ లో కనిపించి, పుట్టలో చేతులు పెడితే కొట్టడానికి నేనేమైన చీమని అనుకుంటున్నావా?, రాక్షసుడిని అంటూ చెప్పే డైలాగ్ వేరే లెవెల్ లో ఉంది అని చెప్పొచ్చు.
మైనస్సులు :
డైలాగ్స్ చాలా బాగున్నాయి కానీ, ప్రభాస్ వాయిస్ ఎందుకో గ్రిప్పింగ్ గా అనిపించలేదు. ఎదో మత్తులో డైలాగ్స్ చెప్తున్నట్టుగా అనిపించింది. ఈమధ్య కాలం లో ప్రభాస్ తన ప్రతీ సినిమాలోనూ ఇదే డైలాగ్ డెలివరీ తో లాగేస్తున్నాడు. అదే విధంగా కొన్ని VFX షాట్స్ చూసేందుకు బాగలేవు. రకరకాలుగా హారర్ థ్రిల్లింగ్ అనుభూతి కలిగించే ప్రయత్నం డైరెక్టర్ చేసాడు కానీ, ఆడియన్స్ కి వాటిని చూసి భయం ఫీలింగ్ రాలేదు. థియేటర్ లో వేరే రకమైన అనుభూతి కలగొచ్చేమో కానీ, ట్రైలర్ లో మాత్రం హారర్ థ్రిల్లర్ ఫీలింగ్ కలగలేదు. అంతే కాకుండా కథ విషయం లో కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోయినట్టు అనిపించింది. చాలా మందికి ఏందీ ఈ గజిబిజి గందరగోళం అని అనిపిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.