Rajasaab Censor: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్ ‘(Rajasaab Movie) మూవీ వచ్చే నెల 9 న ప్రపాంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బోలెడంత కంటెంట్ బయటకు వచ్చింది. కానీ ఆడియన్స్ కి ఒక్క కంటెంట్ కూడా ఎందుకో సరిగా కనెక్ట్ అవ్వలేదు. ఫలితంగా ఈ సినిమాపై జెనరేట్ అవ్వాల్సిన హైప్ జెనరేట్ అవ్వలేదు. అందుకే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ ఉన్నాయి. జరిగిన ఆ కాస్త అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళే చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చారట. సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాల వరకు ఉంటుందట.
అయితే ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు చెప్పిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా కాసేపు, ప్రభాస్ మార్క్ కామెడీ టైమింగ్ మరియు హీరోయిజం తో సాగిపోతుంది అట. మధ్యలో కొన్ని హారర్ ఎలిమెంట్స్ అభిమానులను థ్రిల్ కి గురి చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అవ్వుద్ది అట. కామెడీ సన్నివేశాలు, హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా ప్యాక్ చేయడం లో డైరెక్టర్ మారుతీ ఫస్ట్ హాఫ్ లో సక్సెస్ అయ్యినట్టు తెలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఆరంభం కాస్త గ్రిప్పింగ్ గానే ఉన్నప్పటికీ, మధ్యలో బాగా స్లో అవుతుందని టాక్. సినిమా నిడివి కూడా ఆడియన్స్ సహనానికి కాస్త పరీక్ష పెట్టేలా ఉంటుందట.
ఓవరాల్ ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంటే, సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ రేంజ్ లో ఉందని, ప్రభాస్ కి ఈ మాత్రం ఉంటే చాలు అవలీలగా 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేస్తాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కీలక సన్నివేశాల్లో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి ఇస్తుందని అంటున్నారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే, ఆయన లుక్స్ చాలా సన్నివేశాల్లో బాగాలేదట కానీ, రెండు పాత్రల్లో నటన మాత్రం అదరగొట్టేసాడని టాక్. చూడాలి మరి ఆడియన్స్ నుండి కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి, ఆడియన్స్ నుండి భారీ బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిన అవసరం ఉంది, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.