Prabhas : చాలామంది స్టార్ హీరోల డేట్స్ కోసం స్టార్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్న సందర్భంలో మారుతి లాంటి మీడియం రేంజ్ దర్శకుడికి ప్రభాస్ డేట్స్ అయితే ఇచ్చాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా అప్పుడేప్పుడో స్టార్ట్ అయింది. ఇంకా ఆ సినిమా ఇప్పటివరకు పూర్తయితే కావడం లేదు. మరి ఎందుకని ప్రభాస్ ఈ సినిమా విషయంలో చాలా వరకు లేట్ చేస్తున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. వర్షం (Varsham) సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత చేసిన ఛత్రపతి, పౌర్ణమి, యోగి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి సినిమాతో తమకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలో ఆయన నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఉండడం విశేషం…ఇక బాహుబలి 2(Bahubali 2 ) సినిమాతో ఆయన పెను ప్రభంజనాలను సృష్టించాడు. కానీ ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్లను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ప్రస్తుతం భారీ రేంజ్ లో సినిమాలు చేసి అద్భుతాలను క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ మారుతి(Maruthi) డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా స్టార్ట్ అయి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.
కారణం ఏంటి అంటే ప్రభాస్ కి ఈ సినిమా చేయడం ఇష్టం లేనట్టుంది. అందువల్లే ఆయన ఈ సినిమాకి సంబంధించిన డేట్స్ ని ఇవ్వడం లో లేట్ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ట్ అయిన ఫౌజీ సినిమాకి ఎక్కువగా డేట్స్ కేటాయిస్తున్నాడు. దానివల్లనే రాజాసాబ్ సినిమా కి మాత్రం అసలు డేట్స్ అయితే ఇవ్వడం లేదు.
ఏప్రిల్ 10 వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది అంటూ అనౌన్స్ చేశారు. మరి పదవ తేదీకి మరొక 50 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపధ్యంలో ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొని అనుకున్న తేదీకి వస్తుందా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక దాతో ఈ సినిమాకి సంబంధించిన కొత్త డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసే విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ పోన్ అవ్వనున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పటికి రెండు మూడు సార్లు పోస్టు పోన్ చేసిన ఈ సినిమా మీద రోజు రోజుకి హైప్ అయితే తగ్గుతుంది. మరి మరోసారి ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీ రేంజ్ లో చేస్తే తప్ప ఈ సినిమా మీద భారీ హైప్ అయితే రాదు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ఇది ఆయన కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది…