Sye movie producer Aavula Giri
SS Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి(Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం భారీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పటికే ఆయన పాన్ ఇండియా స్టేజ్ ను దాటి పాన్ వరల్డ్ లోకి దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించి సూపర్ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి (Rajamouli) తీసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి…కానీ ఆయనకు మాత్రం ఒక సినిమా విషయంలో తీరని అసంతృప్తి అయితే ఉందనే విషయాన్ని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. అది ఏంటి అంటే సై సినిమాకి హిట్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమాకి కలెక్షన్స్ అయితే భారీగా రాలేదు… కారణం ఏదైనా కూడా ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఆవుల గిరి(Avula giri) ఆ సినిమా లాభాలు అయితే రాలేదు. కానీ లాసులు కూడా రాలేదు ఎంత పెట్టారో అంత డబ్బులైతే వచ్చాయి.
దాంతో రాజమౌళి అవుల గిరి బ్యానర్ లో మరొక సినిమా చేస్తానని కమిట్మెంట్ అయితే ఇచ్చాడు…దానికి తగ్గట్టుగానే రాజమౌళి రజనీకాంత్(Rajini Kanth) తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. ఇంకా ఆ సినిమాకు ఆవుల గిరినే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడనే చర్చలు కూడా జరిగాయి రజినీకాంత్ కూడా కథను వినిపించారు. ఆయన కూడా ఆ కథని ఓకే చేశారు.
కానీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు మొత్తానికైతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు. కాబట్టి ఆవుల గిరి తో మరో సినిమా చేసే అవకాశాలైతే లేవనే చెప్పాలి. ఆయన కూడా సినిమాలు ఏమీ చేయకుండా బిజినెస్ పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. మరి మొత్తానికైతే ఆవుల గిరి ఒక్క ప్రొడ్యూసర్ ను మినహాయిస్తే రాజమౌళితో చేసిన ప్రతి ప్రొడ్యూసర్ కూడా భారీ లాభాలు ఆర్జించడం విశేషం… మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు కనక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అతనికి భారీగా లాభం వచ్చే విధంగా ప్రణాళికలైతే రూపొందిస్తాడు. మరి ఫ్యూచర్ లో ఆవుల గిరి ప్రొడ్యూసర్ గా రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్దిరోజుల వెయిట్ చేయాల్సిందే.