Rajamouli: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ప్రస్తుతం లుక్స్ పరంగా ‘హీరో అంటే ఇలా ఉండాలిరా’ అని అనిపించే కటౌట్స్ ఉన్న సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే మనకి ముందుగా గుర్తుకువచ్చే హీరోలు ప్రభాస్, హృతిక్ రోషన్. వీళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్ కి అందమొస్తుంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ లుక్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి కానీ, హృతిక్ రోషన్ మాత్రం ఒకప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అదే లుక్స్ ని మైంటైన్ చేస్తూ గ్రీక్ గాడ్ గా పిలవబడుతున్నాడు. ప్రభాస్ కూడా లుక్స్ ని మైంటైన్ చేస్తూ, వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా పడితే, చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే రాజమౌళి గతంలో ప్రభాస్, హృతిక్ రోషన్ కి సంబంధించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ చేస్తున్నారు నెటిజెన్స్.
అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ రాజమౌళి ని ఒక ప్రశ్న అడుగుతూ ప్రభాస్, హృతిక్ రోషన్ లలో ఎవరు బెస్ట్ అని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ప్రభాస్..అందులో ఎలాంటి సందేహం లేదు. లుక్స్ పరంగా కానీ, నటన పరంగా కానీ ప్రభాస్ హృతిక్ రోషన్ కంటే పది అడుగులు ముందుంటాడు’ అని చెప్పుకొచ్చాడు. సాధారణంగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు, నటీనటుల గురించి ఇంత ఓపెన్ గా కామెంట్స్ చేయరు. కానీ రాజమౌళి మాత్రం తన మనసులో ఉన్న మాటలను బయటపెట్టి కుండబద్దలు కొట్టేసినట్టు చెప్తాడు. అలా గతంలో ఆయన ఎవర్ గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి పై కూడా ఇలాంటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో రాజమౌళి గతంలో ‘మగధీర’ సినిమా తీయాలని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ రామ్ చరణ్ కి షిఫ్ట్ అయ్యింది. ఎలాంటి ఫలితం వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అయితే మగధీర సినిమాని హృతిక్ రోషన్ తో బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ప్లాన్స్ కూడా వేసాడు రాజమౌళి. కానీ ఎందుకో హృతిక్ రోషన్ అందుకు ఒప్పుకోలేదు. బహుశా అప్పటి నుండి రాజమౌళి హృతిక్ రోషన్ పై ముభావం తో ఉండడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేశాడా అనే కోణం లో కూడా విశ్లేషిస్తున్నారు నెటిజెన్స్. బాహుబలి తర్వాత రాజమౌళి సూపర్ స్టార్స్ ని మించిన రేంజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు అందరూ ఆయనతో సినిమాలు చేయాలనీ కోరుకునేవారే కానీ, ఆయన పలానా హీరోతో పని చేయాలి అని కోరిక వెళ్లబుచ్చే స్థాయిలో లేరు. అందుకే ఇంత ధైర్యం గా ఆయన చెప్పేస్తున్నాడని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే హృతిక్ రోషన్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆగస్టు లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.