Jawan On Rajamouli
Jawan On Rajamouli: ఊహించినట్లే జవాన్ మూవీకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. తన ప్రీవియస్ బ్లాక్ బస్టర్ పఠాన్ ఫస్ట్ డే వసూళ్లను జవాన్ బీట్ చేసింది. అంతే కాదు కెజిఎఫ్ 2, బాహుబలి 2ని సైతం దాటేసింది. జవాన్ ఇండియా వైడ్ రూ. 75 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా వరల్డ్ వైడ్ రూ. 125 కోట్ల వరకూ రాబట్టినట్లు సమాచారం. జవాన్ సక్సెస్ పై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. షారుక్ ఖాన్, దర్శకుడు అట్లీలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
”ఇందుకే షారుక్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షా అన్నారు. జవాన్ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ దక్కాయి. ఇక నార్త్ ఇండియాలో కూడా తన విజయాల పరంపర కొనసాగించిన దర్శకుడు అట్లీకి అభినందనలు. అద్భుత విజయం అందుకున్న జవాన్ టీమ్ కి శుభాకాంక్షలు…” అని ట్వీట్ చేశారు. రాజమౌళి ట్వీట్ తో జవాన్ సినిమాకు మరింత ప్రచారం లభించింది.
హీరో మహేష్ బాబు సైతం జవాన్ మూవీపై వరుస ట్వీట్స్ వేశారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నా ఫ్యామిలీతో జవాన్ చిత్రం చూడాలని ట్వీట్ చేయగా… ఎప్పుడు చూస్తున్నారో చెబితే నేను కూడా మీతో జాయిన్ అవుతానని షారుక్ రిప్లై ఇచ్చాడు. సినిమా అద్భుతంగా ఉందంటూ మహేష్ బాబు మరో ట్వీట్ వేయడం విశేషం.
జవాన్ మూవీకి తెలుగులో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు దక్కినట్లు సమాచారం. నయనతార షారుక్ కి జంటగా నటించగా… దీపికా పదుకొనె గెస్ట్ రోల్ లో కనిపించింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు. ప్రియమణి కీలక పాత్రలో ఆకట్టుకుంది. జవాన్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా విడుదలైంది.
This is the reason why @IamSRK is the Baadshah of the box office… What an earth-shattering opening…
Congratulations @Atlee_dir for continuing the success streak in the north too, and congrats to the team of #Jawan for the stupendous success…:)
— rajamouli ss (@ssrajamouli) September 8, 2023
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Rajamoulis shocking comments on baahubali 2s record breaking jawaan shah rukh and atlee
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com