https://oktelugu.com/

Game Changer Trailer: చరణ్ అలాంటి సన్నివేశాలు చేయడానికి నేను ఒప్పుకోను..’గేమ్ చేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

ప్రతీ ఫ్రేమ్ లోనూ రామ్ చరణ్ నట విశ్వరూపం, డైరెక్టర్ శంకర్ టేకింగ్ కనిపించింది. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి డైరెక్టర్ రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశాడు. ఆయన హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : January 2, 2025 / 07:12 PM IST

    Game Changer Trailer(5)

    Follow us on

    Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. శంకర్ నుండి ఎలాంటి సినిమా అయితే మనమంతా కోరుకుంటామో, అలాంటి సినిమాని ఈ చిత్రం ద్వారా అందించినట్టు ట్రైలర్ ని చూస్తే అనిపించింది. ప్రతీ ఫ్రేమ్, ప్రతీ షాట్ లో క్వాలిటీ తన వింటేజ్ పనితనం ని మరోసారి బయట పెట్టింది. సినిమాలో కంటెంట్ చాలా బలంగా ఉందని, ఎమోషన్ అయితే వేరే లెవెల్ లో వర్కౌట్ అయినట్టు మనకి ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ప్రతీ ఫ్రేమ్ లోనూ రామ్ చరణ్ నట విశ్వరూపం, డైరెక్టర్ శంకర్ టేకింగ్ కనిపించింది. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి డైరెక్టర్ రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశాడు. ఆయన హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

    ఆయన మాట్లాడుతూ ‘శంకర్ గారిది ఇదే మొట్టమొదటి తెలుగు సినిమా అని చెప్తుంటే, అవునా నిజమా అని అనిపించింది. ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రజలకు మీరు తమిళ డైరెక్టర్ కాదు సార్, తెలుగు డైరెక్టర్. మీరంటే ఇక్కడ పని చేసే డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ మరియు ఇతర టెక్నీషియన్స్ కి అభిమానం కాదు సార్, అంతకు మించిన గౌరవం. దిల్ రాజు మీతో ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం ఆ గౌరవమే అయ్యి ఉంటుంది. గత పది సంవత్సరాలలో ఎక్కువగా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్నాం. ఈ జనరేషన్ డైరెక్టర్స్ అందరూ మమ్మల్ని చూసి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు. మా అందరికీ ఆయనే నిజమైన ఓజీ’ అంటూ చెప్పుకొచ్చాడు.

    రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘చాలా మంది చెప్తూ ఉంటారు, నా బ్రదర్ రామ్ చరణ్ ఎదిగిన తీరు గురించి. నేను ప్రత్యక్షంగా చూసాను కూడా, మగధీర లో చూసిన చరణ్ కి, #RRR లో చూసిన చరణ్ కి చాలా తేడా ఉంది. అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను ప్రతీ హీరోని ఒక పేరుతో పిలుస్తూ ఉంటాను, అలా నేను చరణ్ ని హీరో అని పిలుస్తుంటా. ఈరోజు రామ్ చరణ్ ఈ రేంజ్ కి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ ట్రైలర్ లో హెలికాప్టర్ నుండి లుంగీ కట్టి, చేతిలో కట్టి పట్టి దూకుతుంటే జనాలు విజిల్స్ ఎలా ఈలలు వేసి క్లాప్స్ కొడుతారో, ఫోన్ లో చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తూ మాట్లాడిన ఆ షాట్ కి కన్నీళ్లు పెట్టుకుంటారు. అంత హృద్యమైన సన్నివేశాలు చేయగలడు, ఇంత మాస్ యాక్షన్ సీన్స్ చేయగలడు, ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..చరణ్ ఇంకోసారి గుర్రపు స్వారీ సన్నివేశాలు చేసేటప్పుడు నా అనుమతిని తీసుకో, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి నేను ఒప్పుకోను’ అంటూ రాజమౌళి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.