Rajamouli- Mahesh Babu: మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఎస్ఎస్ఎంబి 29. రాజమౌళి దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందనుంది. మహేష్ ఫ్యాన్స్ చిరకాల కల ఈ ప్రాజెక్ట్. మూవీపై అధికారిక ప్రకటన రాగా… ఎప్పుడు పట్టాలెక్కుతుందనే ఆతృతగా అందరిలో ఉంది. ఆ మధ్య రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ 2023 జూన్, జులై నెలల్లో షూటింగ్ మొదలయ్యే అవకాశం కలదన్నారు. కానీ అలా జరగలేదు. ప్రీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం మాత్రం లేదు. దీంతో మహేష్-రాజమౌళి మూవీ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడనే సందేహం నెలకొంది.
టాలీవుడ్ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో రాజమౌళి బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్దమై, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక మాత్రమే షూటింగ్ మొదలు కానుంది. అయితే మహేష్ బర్త్ డే కానుకగా లాంచింగ్ ఈవెంట్ ఘనంగా నిర్వయించనున్నారట. మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న రాజమౌళి ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేశారట. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు అయ్యే దాన్ని బట్టి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ఆధారపడి ఉంటుందంటున్నారు.
పరిస్థితులు చూస్తే… 2024 చివర్లో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం కలదు. ఆ లెక్కన మహేష్ పాన్ ఇండియా మూవీ థియేటర్స్ లోకి వచ్చేది 2026 తర్వాతే. కనీసం రెండేళ్ల సమయం ఈ ప్రాజెక్ట్ తీసుకుంటుంది. రాజమౌళి మూవీ అంటే నిర్ణీత సమయం అంటూ ఉండదు. ఐదేళ్లు బాహుబలి సిరీస్ తెరకెక్కించిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని మరో నాలుగేళ్లు తెరకెక్కించారు.
ఇక జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. ఆర్ ఆర్ ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ మీద హింట్ ఇచ్చారు. రాజమౌళి మహేష్ చిత్రానికి రూ. 800 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట. హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు భాగం కానున్నారట. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు.