Rajamouli : టెస్ట్, వన్డే, టి20.. ఇలా ఈ ఫార్మాట్ ఐనా సరే వార్నర్ అద్భుతంగా ఆడతాడు. ఆస్ట్రేలియా జట్టుకు తనదైన బ్యాటింగ్ స్టైల్ తో అద్భుతమైన విజయాలను కట్టబెట్టాడు. అయితే అటువంటి ఆటగాడు ఇప్పుడు తీవ్రమైన నిరాశలో ఉన్నాడు. అతడి అభిమానులు కూడా తీవ్రమైన నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు.. అయితే వార్నర్ ఇంతటి ఇబ్బంది ఎదుర్కోవడానికి టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కారణమని సామాజిక మాధ్యమాలలో కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు.. రాజమౌళి ఎఫెక్ట్ వల్లే వార్నర్ ఇంతటి ఇబ్బందుల్లో పడ్డాడని నెటిజన్లు వివరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వార్నర్ అమ్ముడుపోలేదు. అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ అతడు అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. వాస్తవానికి మెగా వేలం ప్రారంభానికి ముందు వార్నర్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ డేవిడ్ వార్నర్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఎందుకంటే గతంలో ఎస్ఎస్ రాజమౌళితో కలిసి వార్నర్ ఒక ప్రకటనలో కనిపించాడు. అతడితో కలిసి పని చేయడం వల్లే వార్నర్ ఐపిఎల్ వేలంలో అమ్ముడు పోలేదని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో రకరకాల మీమ్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అభిమానులు చెబుతున్నది ఏంటంటే..?
ప్రభాస్, రామ్ చరణ్ వంటి వారు రాజమౌళితో పని చేశారు. వారంతా ఇండస్ట్రీ హిట్స్ సాధించారు. రామ్ చరణ్ మగధీర, ఆర్ఆర్ ఆర్, ప్రభాస్ ఛత్రపతి, బాహుబలి, బాహుబలి -2 సినిమాలు తీశారు. మగధీర తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాతో ఫెయిల్యూర్ చూశారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆచార్యతో మరోసారి విఫలమయ్యారు. ఇక ప్రభాస్ బాహుబలి సిరీస్ ల తర్వాత సాహో తో ఫెయిల్యూర్ చవి చూశారని.. ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆర్ ఆర్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని వివరిస్తున్నారు. అయితే డేవిడ్ వార్నర్ కు బదులుగా యువ ఆటగాళ్లను తీసుకోవడం ఉత్తమమని ఆయా యాజమాన్యాలు అలా భావించి ఉండవచ్చని వ్యాఖ్యలు చేస్తున్నారు. “సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే రాజమౌళితో పనిచేసినవారు పరాజయాలు ఎదుర్కొన్నారు. రాజమౌళి దిగ్గజ దర్శకుడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే కొన్ని కొన్ని విషయాలలో సెంటిమెంట్లను అనుసరించాల్సి ఉంటుంది. అలాంటిదే వార్నర్ జీవితంలోను చోటుచేసుకుని ఉండొచ్చని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఐతే వార్నర్ ఒకప్పటిలాగా ఆడక పోవడం.. ఇటీవల ఐపీఎల్లో సత్తా చాట లేకపోవడం.. యువ ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తుండడం.. వంటి కారణాల వల్ల వార్నర్ కు ఐపీఎల్ లో చోటు దక్కకపోయి ఉండవచ్చని స్పోర్ట్స్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
The Great SS Rajamouli with David Warner in a Ad shoot. David Warner is more indian than most of Indias. @davidwarner31 pic.twitter.com/FROMY9tVWC
— Satya Prakash (@Are_Sambha) April 12, 2024