Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి చేయబోతున్న పాన్ ఇండియా సినిమా పై తాజాగా రాజమౌళి క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. అసలు కొన్ని కాంబినేషన్లు చూడటానికి ప్రేక్షకులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తారు. అలాంటి కలయికే జక్కన్న – మహేష్ లది. నిజానికీ ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సింది. కానీ, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాకి రంగం సిద్ధం అయ్యింది. ఇంతకీ రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి ఇచ్చిన అప్ డేట్ ఏమిటి అని తెలుసుకోవాలనేగా మీరు ఆసక్తిగా ఉన్నారు. అయితే కింది పేరా చదివి తెలుసుకోండి.

రాజమౌళి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి అక్కడ మహేష్ తో చేయబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో రాజమౌళి మాటల్లోనే.. ‘మహేష్ తో చేయబోతున్న సినిమా కథ విషయానికి వస్తే.. అది ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహసికుడి కథ’ అని, ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని రాజమౌళి తెలిపారు.
మరోపక్క రాజమౌళితో కలిసి పని చేయడం పై ఇటు మహేశ్ బాబు కూడా తన స్పందన తెలియజేశాడు. ‘రాజమౌళి గారితో పనిచేయాలన్న నా కల ఇప్పుడు సాకారం కాబోతోంది. రాజమౌళి గారితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. అందుకే.. ఆయనతో చేయబోయే సినిమా విషయంలో నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇది పాన్ ఇండియా సినిమా అవుతుంది’ అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాశారు. ఆ ఫారెస్ట్ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుంది. అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి.. ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారు. క్లుప్తంగా చెప్పుకుంటే ఈ సినిమా కథ ఇదే.

కాకపోతే.. ఫారెస్ట్ లో జరిగే యాక్షన్ ఎడ్వెంచరెస్ సీన్లు అద్భుతంగా ఉంటాయట. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి ని మించినోళ్ళు లేరు. కాబట్టి.. సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు. ఇప్పుడు మహేష్ చేస్తే.. కచ్చితంగా ఇండియా వైడ్ గా ఈ సినిమా పై ఆసక్తి ఉంటుంది.
అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎప్పటిలాగే రాజమౌళి ఈ సినిమాని నేషనల్ వైడ్ గా భారీ సినిమాగా ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి హీరో అంటేనే.. మాస్ కి పరాకాష్ట. అందుకు తగ్గట్టుగానే హీరో లుక్ ను రాజమౌళి డిజైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే మహేష్ లుక్ కోసం జక్కన్న ప్రత్యేక కసరత్తులు చేశాడు. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా మహేష్ ఈ సినిమాలో కనిపిస్తాడట.