Rajamouli- NTR: దర్శకధీరుడు రాజమౌళితో ఎన్టీఆర్ స్నేహం, సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైంది. ఎన్టీఆర్ ఫస్ట్ హిట్ స్టూడెంట్ నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళినే. ఎన్టీఆర్ కి స్టూడెంట్ నెంబర్ వన్ సెకండ్ మూవీ కాగా రాజమౌళికి ఫస్ట్ చిత్రం. అయితే తన ఫస్ట్ మూవీ హీరోగా ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళికి ఏమాత్రం నచ్చలేదట. టీనేజ్ లో ఉన్న ఎన్టీఆర్ ని చూసి నా మూవీ హీరో ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నాడట. అయితే కుంటి గుర్రంతో రేసు గెలిస్తే అప్పుడు ఇంకా గొప్పగా ఉంటుంది.రెట్టింపు పేరు వస్తుంది. ఆ ఆలోచనతో ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడట.

ఎన్టీఆర్ లుక్ చూసి రాజమౌళి తక్కువ అంచనా వేశాడట. కానీ సెట్స్ లో ఎన్టీఆర్ నటన, డాన్సులు చూసి తన అభిప్రాయం మార్చుకున్నాడట. అప్పుడు తనకు మంచి హీరోగా దొరికాడని సంతోష పడ్డారట. గతంలో ఈ విషయాన్ని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళితో సినిమా చేసేనాటికి ఎన్టీఆర్ వయసు 19 ఏళ్ళు. నూనూగు మీసాలు, పొట్టిగా ఉన్న ఎన్టీఆర్ వయసుపరంగా ఇంకా పూర్తి పరిపక్వత చెందలేదు. ఎన్టీఆర్ మనవడిగా పరిశ్రమకు పరిచయమయ్యాడు. హీరోగా ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ టాలెంట్ పెద్దగా బయటపడలేదు.
స్టూడెంట్ నెంబర్ వన్ మూవీలో డాన్సులు, పెర్ఫార్మన్స్ చూసి ఇండస్ట్రీకి మరో స్టార్ దొరికాడని అప్పుడే జనాలు డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో సింహాద్రి విడుదలైంది. రాజమౌళి తన రెండో చిత్రం కూడా ఎన్టీఆర్ తోనే చేశారు. సింహాద్రి ఇండస్ట్రీ నమోదు చేసి టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసింది. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కొంత స్ట్రగుల్ అయ్యారు. ప్లాప్స్ లో ఉన్న ఎన్టీఆర్ కి రాజమౌళి యమదొంగ సినిమాకు బ్రేక్ ఇచ్చాడు. ఇక లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వీడేం హీరో అనుకున్న రాజమౌళి హీరోగా వీడే కావాలి అనుకునేలా ఎన్టీఆర్ మెప్పించాడు. రాజమౌళి కెరీర్ లో 12 సినిమాలు చేస్తే… వాటిలో నాలుగు ఎన్టీఆర్ తోనే చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆస్కార్ కి పోటీ పడే స్థాయి చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. నేడు రాజమౌళి పుట్టినరోజు కాగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.