Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు… ‘శాంతి నివాసం’ సీరియల్ తో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటి అని చాలామంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి ఒక కథని ఎంచుకుంటే అందులో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి హై ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ ఉండే విధంగా చూసుకుంటాడు. దానివల్ల సగటు ప్రేక్షకుడు వాటికి థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాడు. తద్వారా ఆ సినిమాని మరొకసారి చూడాలని అభిమానులు థియేటర్ కి వచ్చి మరి ఆ సినిమాని చూస్తూ ఉంటారు.
అయితే మిగతా దర్శకులు మాత్రం ఒక కథని స్టార్ట్ చేసి చివరి వరకు ఆ కథలో ఉన్న సోల్ ని చంపేసి వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా కన్ క్లూజన్ ని ఇచ్చేస్తున్నారు. అందువల్లే వాళ్ళ సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. ఇక మరి కొంతమంది దర్శకులు మాత్రం కథ బాగున్నప్పటికి డైరెక్షన్లో చాలావరకు మిస్టేక్స్ అయితే చేస్తున్నారు.
అందువల్ల కూడా సినిమాలు పోతున్నాయి. ఇక మరి కొంతమంది కథ బాగుండి, డైరెక్షన్ బాగున్నప్పటికి స్క్రీన్ ప్లే ని ఎక్స్ట్రాడినరీగా మలచడంలో మాత్రం చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నారు. అందువల్లే రాజమౌళి లాగా వాళ్లందరూ సక్సెస్ లను సాధించలేకపోతున్నారు.
ఎవరైతే రాజమౌళిని ఫాలో అవుతూ అతని లాగా గ్రాఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎమోషన్స్ ను, ఎలివేషన్స్ ను హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే భారీ సక్సెసులైతే వస్తున్నాయి…ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే భారీ రికార్డు లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…