Varanasi vs Ramayana: మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంతో మంది పాన్ ఇండియన్ డైరెక్టర్స్ ఉండొచ్చు, రాబోయే రోజుల్లో ఎంతో మంది పాన్ ఇండియన్ డైరెక్టర్స్ గా ఎదగొచ్చు కూడా, కానీ వీళ్ళెవరూ కూడా రాజమౌళి(SS Rajamouli) విజన్ ని మ్యాచ్ చెయ్యలేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నేడు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో 1800 కోట్ల రూపాయిల ఖర్చు తో తీస్తున్న ‘రామాయణ్’ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదల అయ్యింది. ఈ టీజర్ లోని షాట్స్ సీరియల్స్ రేంజ్ క్వాలిటీ లో కూడా లేదని , దీనికోసం అంత బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారంటే అసలు నమ్మశక్యం గా లేదని అంటున్నారు. అంతే కాకుండా రాజమౌళి ‘వారణాసి’ మూవీ గ్లింప్స్ లోని షాట్స్ ని , నేడు విడుదల చేసిన ‘రామాయణ్’ షాట్స్ ని పోలుస్తూ, రాజమౌళి ని మించిన డైరెక్టర్ ఇండియా లేరని అంటున్నారు నెటిజెన్స్.
‘వారణాసి’ పూర్తి స్థాయి రామాయణం సినిమా కాదు. కేవలం రామాయణం లోని ఒక ఘట్టాన్ని తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంతే. రామాయణం కి సంబంధించిన సన్నివేశాల నిడివి ఈ చిత్రంలో దాదాపుగా 20 నిమిషాల వరకు ఉంటుందట. ఈ 20 నిమిషాల భాగం, నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రెండు భాగాల ‘రామాయణ్’ కంటే గొప్పగా ఉంటుందని , దేశం మొత్తం మరోసారి రాజమౌళి నామస్మరణ చేస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించే రోజు దగ్గర్లోనే ఉందని అంటున్నారు. కేవలం రాజమౌళి మాత్రమే కాదు, మన ఇతిహాసాలకు సంబంధించిన సినిమాలు తీయాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ తర్వాతే ఎవరైనా అని అంటున్నారు నెటిజెన్స్. అందుకు ఉదాహరణ గా ‘కల్కి’ చిత్రం లో మహాభారతం సీక్వెన్స్ సన్నివేశాలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.
Also Read: రణబీర్ కపూర్ ‘రామాయణ్’ టీజర్ రివ్యూ : విజువల్ వండర్ కి సరికొత్త నిర్వచనం..
‘కల్కి’ లో మహాభారతం సీక్వెన్స్ ని కేవలం ఒక రూమ్ లో తీశాడు నాగ అశ్విన్, ఎంతటి అద్భుతమైన క్వాలిటీ తో తీసాడో మీరే చూడండి, మా టాలీవుడ్ డైరెక్టర్స్ ప్రతిభ అలాంటిది అంటూ బాలీవుడ్ పై సెటైర్లు వేస్తూ పోస్టులు చేస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘హనుమాన్’ చిత్రం క్వాలిటీ ని కూడా మ్యాచ్ చేయలేకపోయారంటూ విమర్శిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ట్రోల్స్ ఉన్నాయి. నితీష్ తివారి ఇదే అద్భుతమైన క్వాలిటీ అని భ్రమపడితే కచ్చితంగా ‘ఆదిపురుష్ ‘ తరహా ఫలితాన్ని ఎదురుకోవాల్సి ఉంటుంది. కచ్చితంగా సినిమా విడుదల సమయానికి గ్రాఫిక్స్ పార్ట్ ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్. మరి డైరెక్టర్ నితీష్ తివారి సోషల్ మీడియా లో వచినటువంటి ఈ ఫీడ్ బ్యాక్ ని తీసుకుంటాడా లేదా అనేది చూడాలి.
