Homeఎంటర్టైన్మెంట్Rajamouli : రాజమౌళి.. శ్రీను.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ?

Rajamouli : రాజమౌళి.. శ్రీను.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ?

Rajamouli : రాజమౌళికి పరిశ్రమలో వివాదరహితుడిగా పేరుంది. ఆయన మృదు స్వభావి. పబ్లిక్ లో రాజమౌళి ప్రవర్తన చాలా వినమ్రంగా ఉంటుంది. ఒక స్టార్ దర్శకుడిని అన్న గర్వం ఆయనలో కనిపించదు. మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ కలిగిన రాజమౌళి పై శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశాడు. దేశాన్ని శాసిస్తున్న నెంబర్ వన్ దర్శకుడైన రాజమౌళి తనను మానసికంగా వేధిస్తున్నాడు. ఆయన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాను, అంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

శ్రీనివాసరావు వీడియో సారాంశం ఏమిటంటే… 30 ఏళ్ళుగా రాజమౌళి, శ్రీను మిత్రులు. ఈ ప్రాణ స్నేహితులు జీవితంలోకి రమ వచ్చారు. ఆమె రాకతో సమీకరణాలు మారిపోయాయి. రమను రాజమౌళి, శ్రీను ప్రేమించారు. వారిది ఒక ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. ఎవరు రమను వివాహం చేసుకోవాలనే చర్చ వచ్చింది. ముగ్గురం కలిసి ఉందాం అనుకున్నారు. లేదంటే రమను తన కోసం త్యాగం చేయమని శ్రీనును రాజమౌళి కోరాడు. ముగ్గురు కలిసి ఉండటం బాగోదని భావించిన శ్రీను, రమను రాజమౌళి కోసం వదిలేశాడు. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. శ్రీను వివాహం లేకుండా ఒంటరిగా ఉండిపోయాడు.

Also Read : రాజమౌళి మీద కామెంట్స్ చేసిన శ్రీనివాసరావు కి మతి స్థిమితం సరిగ్గా లేదా..?

ఇదంతా శాంతి నివాసం సీరియల్ సమయంలో జరిగింది. నెంబర్ వన్ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి శ్రీనును టార్చర్ చేస్తున్నాడు. గతంలో జరిగిన ఈ విషయం శ్రీను ఎక్కడ బయటపెడతాడో అనే భయం రాజమౌళికి ఏర్పడింది. అందుకే శ్రీనును మానసిక వేదనను గురి చేస్తున్నాడు. అందుకే శ్రీను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాడు. శ్రీను చెబుతుంది అబద్దం అనుకుంటే… కేసును సుమోటోగా తీసుకుని రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. అప్పుడే నిజాలు బయటపడతాయని శ్రీను వాదన..

శ్రీను సెల్ఫీ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. శ్రీనివాసరావు ఆరోపణలపై రాజమౌళి స్పందించలేదు. నిజంగా రాజమౌళి-శ్రీను-రమ మధ్య ట్రై యాంగిల్ లవ్ డ్రామా నడిచిందా? అనేది ఒక మిస్టరీ. రాజమౌళి, రమ కుటుంబాలకు శ్రీనివాసరావు సన్నిహితుడు అని ఆయన మాటల ద్వారా అర్థం అవుతుంది. కాగా గతంలో రాజమౌళి-రమ పలు ఇంటర్వ్యూలలో తమ లవ్ స్టోరీ గురించి వెల్లడించారు. కీరవాణి భార్య శ్రీవల్లికి రమ సిస్టర్ అవుతారు. ఆ విధంగా రాజమౌళితో రమకు పరిచయం ఉంది. కుటుంబ సభ్యులుగా ఒకరికొకరు తెలుసు. ఒకరోజు రమకు రాజమౌళి ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించడంతో వివాహం చేసుకున్నారు.

ఇందులో కొసమెరుపు ఏమిటంటే.. రమకు రాజమౌళితో రెండో వివాహం. కార్తికేయ ఆమె మొదటి భర్త సంతానం. రమను వివాహం చేసుకున్న రాజమౌళి మయూఖ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. ఇక శ్రీనివాసరావు ఆరోపణల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Also Read : వివాదంలో చిక్కుకున్న రాజమౌళి.. టార్చర్ భరించలేక చనిపోతాను అంటూ స్నేహితుడు కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో!

RELATED ARTICLES

Most Popular