Rajamouli: ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో… ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తం నార్త్ వైపు చూసేది. అక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని, మార్కెట్ పెంచుకోవాలని చూసేవారు. ఇప్పుడు నార్త్ ఇండియా హీరోలు సౌత్ వైపు చూస్తున్నారు. సౌత్ చిత్రాలు నార్త్ లో సక్సెస్ అవుతున్నప్పుడు నార్త్ సినిమాలు సౌత్ లో ఎందుకు సక్సెస్ కావనే అభిప్రాయానికి వచ్చారు. తెలుగు, తమిళ్, కన్నడ వంటి పరిశ్రమల్లో మార్కెట్ ఏర్పరుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే సమయంలో మేము గొప్ప అనే ఆలోచనా ధోరణి కూడా మారుతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్స్ సౌత్ చిత్రాలను పొగడడమే దీనికి నిదర్శనం. ఒక విధంగా ఇదంతా రాజమౌళి వలెనే సాధ్యమైంది. బాహుబలి సినిమాతో ఆయన దిశా నిర్ధేశం చేయగా… ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకులు ఆ మార్గాన వెళ్లి సక్సెస్ అయ్యారు. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా అవతరించింది.
ఇక నార్త్ వాళ్ళు తమ చిత్రాలు సౌత్ లో ప్రమోట్ చేయాలంటే రాజమౌళి సహాయం తీసుకుంటున్నారు. మార్కెటింగ్ జీనియస్ గా పేరున్న జక్కన్న సహాయం చేస్తే మూవీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్ కోసం హీరో రన్బీర్ కపూర్ వైజాగ్ వచ్చారు. ఆయన రాజమౌళితో పాటు వేదిక పంచుకున్నారు. ఈ ఈవెంట్ లో రన్బీర్ రాజమౌళి కాళ్లకు నమస్కారం చేయడంతో అందరూ షాక్ అయ్యారు. రాజమౌళి ఇండియాలోనే పెద్ద దర్శకుడు అయినప్పటికీ ఓ నార్త్ సూపర్ స్టార్ ఆయనకు ఆ స్థాయి గౌరవం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: Central Government New Portal: కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్.. ఇక ఈజీగా ఆన్‌లైన్ లోన్..
సౌత్ చిత్రాలు, హీరోలు, సాంకేతిక నిపుణులపై ఒకప్పుడున్న చులకన భావన ఇప్పుడు నార్త్ వాళ్లలో లేదనడానికి ఈ సంఘటన ఉదాహరణ. రాజమౌళి తన చిత్రాలతో బాలీవుడ్ మైండ్ సెట్, థింకింగ్ మార్చేశాడు. నిజంగా ఇది గొప్ప విషయమని చెప్పాలి. ఒకప్పుడు సౌత్ అంటే తమిళ చిత్రాలే అన్నట్లు ఉండేది. ఇప్పుడు తెలుగు తర్వాత తమిళ్ అన్న పరిస్థితి వచ్చింది. మొత్తంగా రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన గొప్ప ఆస్తి అని చెప్పాలి. ఆయన వలెనే తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరింది.
Also Read: Muslims Protest: 25 కోట్ల మంది కోసమే ఇంత బాధా.. 125 కోట్ల మందిని అవమానిస్తే స్పందించరా!?