రాజమౌళి టేకింగ్ మాత్రమే కాదు.. ప్రమోషన్ కూడా రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. ఈ ప్రచారంలో తనదైన వ్యూహాలను జోడించి.. సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తాడు. బాహుబలి ప్రమోషనే ఇందుకు ఉదాహరణ. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మీడియాలో ప్రకటన ఇవ్వకుండా రిలీజ్ అయిన ఏకైక చిత్రం బాహుబలి. ఒక సినిమా ఇలా విడుదల కావడం.. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే మొదటిసారి. ముందు నుంచీ సినిమా మీద హైప్ క్రియేట్ చేయడంతోపాటు.. ఆ టెంపోను కొనసాగించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఐడియా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
దీంతో.. RRR సినిమా విషయంలోనూ ఇదే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే.. ఫస్ట్ లుక్ రిలీజ్ లు వంటి వాటితో సినిమాపై ఆసక్తిని కొనసాగిస్తూ వచ్చిన రాజమౌళి.. తాజాగా ఫ్రెండ్ షిప్ డే సందర్భాన్ని పురస్కరించుకొని దోస్తీ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోనూ రిలీజ్ అయిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీతానికి తోడు విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. కీరవాణి, కార్తికేయ, సతీష్ దినేష్ కృష్ణన్ తోపాటు చివర్లో హీరోలు ఇద్దరు రావడం హైలెట్ గా నిలిచింది.
ఈ పాట సోషల్ మీడియాల్ హాట్ టాపిక్ అయ్యింది. దీంతో.. అందరూ జక్కన్నను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రమోషన్ లో మీకు మీరే సాటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ విషయమై తాజాగా స్పందించారు రాజమౌళి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అసలు నిజం ఏంటన్నది బయటపెట్టాడు.
ఈ మ్యూజిక్ వీడియోను చిత్రీకరించాలనే ఐడియా తనది కాదని చెప్పారు. తన కుమారుడు కార్తికేయకే ఈ క్రెడిట్ మొత్తం చెందాలని రాసుకొచ్చారు. తాను సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో ఉన్నట్టు చెప్పారు. ఈ సమయంలో కార్తికే.. సతీష్, దినేష్ కృష్ణన్ తో కలిసి ఈ పాటను షూట్ చేశాడని, అందరూ బాగా చేశారని కితాబిచ్చారు. ఈ పాటకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని తాను ఊమించలేదని చెప్పాడు జక్కన్న.