RRR’s biggest success: దర్శకుడు రాజమౌళి కీర్తి అంతకంతకూ పెరుగుతూ పోతుంది. బాహుబలి సిరీస్ ఆయన్ని ప్రపంచ దర్శకుల లిస్ట్ లో చేర్చింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి హాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. తన మేకింగ్ తో వారిని ఆకట్టుకున్నారు. లాస్ ఏంజెల్స్, చికాగో వంటి నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ షోస్ కి అమెరికన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. పలు అంతర్జాతీయ వేదికలపై ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్స్ ఈవెంట్స్ కి కుటుంబంతో పాటు రాజమౌళి హాజరయ్యారు.

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందుకున్న అనంతరం ఆయన ప్రసంగించారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఈ అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదికపై మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది. సినిమాను నేను దేవాలయంలా భావిస్తాను. చిన్నప్పుడు థియేటర్ లో ఇష్టమైన మూవీ చూసిన ఆనంద క్షణాలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. నా సినిమాల్లో ప్రతి సీన్ క్రియేట్ చేసే ముందు థియేటర్ లో కూర్చున్న ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఆలోచిస్తాను. ఆడియన్స్ ఆ సీన్ గురించి ఎలా ఫీల్ అవుతారని, అనుకుంటాను.

సినిమా వాళ్లంతా ఒక కుటుంబం అంటారు. నా విషయంలో ఇది కొంచెం భిన్నం. నా సినిమాలకు పని చేసే వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే. నేను తెరకెక్కించే చిత్రాలకు కథ తండ్రి విజయేంద్ర ప్రసాద్, మ్యూజిక్ అన్నయ్య కీరవాణి అందిస్తారు. కాస్ట్యూమ్స్ నా భార్య, లైన్ ప్రొడ్యూసర్స్ గా కొడుకు వదిన, గాయకుడిగా అన్న కొడుకు… ఇలా నా కుటుంబం మొత్తం నా సినిమాల్లో భాగం అవుతారు. నేను భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తాను. ఆర్ ఆర్ ఆర్ మాత్రం విదేశీ ఆడియన్స్ కి కూడా నచ్చింది. న్యూయార్క్, చికాగో ప్రదర్శనల్లో అక్కడి ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారు.. అని ఎమోషనల్ గా మాట్లాడారు.
Also Read: Tamanna – Vijay Varma: నటుడు విజయ్ వర్మతో తమన్నా క్రేజీ లవ్ స్టోరీ… అప్పుడే మనసు ఇచ్చిందట!
కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి రెండు విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఈ క్రమంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి హాజరుకానున్నారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది.
[…] […]